సిదార్ధ్ కు ట్విస్ట్ ఇస్తున్న అల్లు శిరీష్
చెన్నై : త్వరలో భాక్సాఫీస్ వద్ద సిద్దార్ద,అల్లు శిరీష్ పోటీపడనున్నారు. 'ఆడుగలం'తో జాతీయ అవార్డుల పంట పండించిన దర్శకుడు వెట్రిమారన్. ప్రస్తుతం నిర్మాతగా మారి సిద్దార్ద హీరోగా 'ఉదయం' రూపొందిస్తున్నాడు. 'ఎన్‌హెచ్ 4' అనేది ట్యాగ్ లైన్. 19న తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.
మరో ప్రక్క అదే రోజు 'గౌరవం'... ప్రకాశ్‌రాజ్ నిర్మాతగా రాధామోహన్ దర్శకత్వంలోని 'గౌరవం' కూడా 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై తమిళనాట పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలియజేస్తున్నాయి. కించపరిచేలా పలు సన్నివేశాలను తెరకెక్కించారని ఆరోపిస్తున్నాయి. అల్లుఅర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన సరసన యామి గౌతమ్ ఆడిపాడుతోంది.
సిద్ధార్థ్ 'ఉదయం' విషయానికి వస్తే... మణిమారన్ దర్శకుడు.అశ్రిత శెట్టి హీరోయిన్ . రెడ్‌జైంట్ బ్యానరుపై ఉదయనిధి స్టాలిన్ విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతంలోని పాటలు కూడా ఇటీవలే విడుదలై ప్రజాదరణ పొందుతున్నాయి. చాక్లెట్‌బాయ్‌గా కనిపించే సిద్ధార్థ్ ఇందులో యాక్షన్‌హీరోగా నటించినట్లు సమాచారం. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది వర్కవుట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











