మణిరత్నంకు షాకిచ్చిన అమలాపాల్.. మానసిక స్థితి సరిగా లేదంటూ ఆఫర్ రిజెక్ట్
టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ అమలాపాల్ సౌత్ ఇండియాలో నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా కనిపిస్తూనే ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు వివిధ రకాల కాంట్రవర్సీ వార్తల్లో కూడా నిలుస్తోంది. ఇక రీసెంట్ గా అయితే ఆమె ఏకంగా మణిరత్నం ఆఫర్ చేసిన ఒక ప్రాజెక్టులో మంచి క్యారెక్టర్ వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేసిందట. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలియజేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సౌత్ లో బిజీగా
మలయాళం కు చెందిన అమలాపాల్ తెలుగు తమిళ్ కన్నడ అనే భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అన్ని బాషల్లో కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. తమిళంలో అయితే ఈ బ్యూటీ దాదాపు అక్కడ ఉన్న సగం మంది అగ్ర హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తెలుగులో మొదట నాగచైతన్య బెజవాడ సినిమాతో వెండితెరకు పరిచాయమయ్యింది.

నగ్నంగా నటించి
మొదట అమలాపాల్ కేవలం హోమ్లీ పాత్రలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఆ తరువాత కమర్షియల్ కథలను కాకుండా పలు ప్రయోగాత్మకమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకుంది. ఆమె అనే సినిమాలో అయితే అమలాపాల్ ఏకంగా మొదటిసారి నగ్నంగా కనిపించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ సినిమా కూడా అంతగా క్లిక్ కాలేదు.

మణిరత్నం ఆఫర్
ప్రస్తుతం అమలా పాల్ సౌత్ లో అయితే బిజిగానే ఉంది. ఇక క్రమంలో ఆమే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గతంలో మణిరత్నం చేసిన ఒక బిగ్ బడ్జెట్ ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేసినట్లుగా తెలియజేసింది. అందుకు ఆమె ఒక కారణం కూడా చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అప్పుడు తన మానసిక పరిస్థితి బాగో లేకపోవడం వల్లనే మణిరత్నం ఆఫర్ కూడా రిజెక్ట్ చేసినట్లుగా తెలియజేసింది.

మానసిక పరిస్థితి అలా ఉండడంతో
అమలాపాల్ మాట్లాడుతూ.. నేను మణి సర్‌కి వీరాభిమానిని. ఆయనతో వర్క్ చేయాలని అనుకున్నాను. అయితే నేను అనుకున్నట్లు జరగలేదు. 2021లో పొన్నియిన్ సెల్వన్ సినిమా ఆడిషన్స్ కు తనను పిలిచారు. అయితే అప్పుడు మానసిక స్థితి సరిగా లేదు. అందుకే ఆ ఆఫర్‌ను తిరస్కరించాల్సి వచ్చింది. నేను అలా చేసినందుకు చింతిస్తున్నావా అని మీరు నన్ను అడిగితే అప్పుడున్న పరిస్థితులలో నేను రిజెక్ట్ చేసినందుకు కారణాలు ఉన్నాయి.. అని అమలాపాల్ తెలియజేసింది.

బిజీ హీరోయిన్ గా..
అమలా పాల్ చివరిగా తమిళ థ్రిల్లర్ కాడవర్‌లో కనిపించింది. ఆమె లైనప్ లో అధో అంధ పరవై పోలా, టీచర్, క్రిస్టోఫర్, ఆడుజీవితం అనే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇక కల్కి నవల ఆధారంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ను దాదాపు 500కోట్ల భారీ బాధేట్ తో నిర్మించారు. ఇక సినిమా సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శరత్ కుమార్ ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











