twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడా.. అమలాపాల్ అదేంపని.. దర్శకుడితో కలిసి పట్టుబడ్డ సినీతార..

    సినీ నటులు అమలాపాల్, పహద్ ఫాజిల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. కేరళలో పన్ను తప్పించుకోవడానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలపై వీరిపై పాండిచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు.

    By Rajababu
    |

    Recommended Video

    దేవుడా.. అమలాపాల్ అదేంపని..!

    సినీ నటులు అమలాపాల్, పహద్ ఫాజిల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. కేరళలో పన్ను తప్పించుకోవడానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలపై వీరిపై పాండిచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు. అమలాపాల్, ఫాజిల్‌ కేసులో ఇరుక్కోవడం తమిళ, మలయాళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. పోలీసుల తెలిపిన ప్రకారం..

     సినీ నటుల పన్ను ఎగవేతకు

    సినీ నటుల పన్ను ఎగవేతకు

    రూ.20 లక్షలకు పైగా ధర పలికే విలాసవంతమైన కార్లపై 20 శాతం పన్ను తప్పించుకోవడానికి పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో అమలాపాల్, ఫాజిల్ తప్పుడు పత్రాలు సృష్టించారు. కేరళకు చెందిన వీరిద్దరూ కేరళలో కార్లను కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్టర్ చేశారు. అందుకోసం కొన్ని సర్టిఫికెట్లను ఫోర్జరీ చేశారు అని పోలీసుల వెల్లడించారు.

    క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తు

    క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తు

    కేసు నమోదు అయినందున్న అమలాపాల్‌, ఫాజిల్‌ను త్వరలోనే క్రైం బ్రాంచ్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే వీరికి నోటీసులు పంపినట్టు సమాచారం. కొద్దిరోజుల్లో అమలపాల్‌, ఫాజిల్ క్రైం బ్రాంచ్ అధికారుల ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది అని ఓ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

     తప్పుడు పత్రాలతో ఫాజిల్

    తప్పుడు పత్రాలతో ఫాజిల్

    ఫాజిల్‌ కేరళలోని అలప్పు అడ్రస్‌పై కారును లోన్‌పై తీసుకొన్నారు. కానీ రిజిస్టిర్ సమయంలో పాండిచ్చేరి నివాసిగా పత్రాలు సృష్టించారు అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారుల తీవ్రంగా పరిగణిస్తున్నారు.

    తప్పుడు అడ్రస్‌తో అమలాపాల్

    తప్పుడు అడ్రస్‌తో అమలాపాల్

    అందాల తార అమలపాల్ రూ. 1.75 లక్షలు చెల్లించి ఎస్ క్లాస్ బెంజ్ కారును లోన్‌పై తీసుకొన్నారు. అయితే పాండిచ్చేరిలో ఉమేశ్ పేరిట ఉన్న ఓ ఇంటిలో కిరాయికి ఉంటున్నట్టు చూపే పత్రాలను ఆమె సమర్పించారు. ఇదే అడ్రస్ నుంచి చాలా మంది ప్రముఖులు కార్లను రిజిస్టర్ చేసుకొన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

     పన్ను ఎగవేత దందాకు చెక్

    పన్ను ఎగవేత దందాకు చెక్

    ఫోర్జరీ పత్రాలతో పన్ను ఎగవేతకు పాల్పడుతూ కార్లను తప్పుడు పద్ధతిలో రిజిస్టర్ చేసుకొనే దందా తాజాగా పోలీసులు ఛేదించారు. ప్రముఖులు, సినీ నటులు చేసే ఈ దందా వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఏటా రూ.500 కోట్ల నష్టం జరుగుతున్నట్టు అంచనా.

     పాండిచ్చేరిలో జోరుగా దందా

    పాండిచ్చేరిలో జోరుగా దందా

    కేంద్ర పాలిత ప్రాంతాల్లో పన్ను చెల్లింపు చాలా తక్కువగా ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌పై పన్ను తప్పించుకోవడానికి ప్రముఖులు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు 1500 వెహికిల్స్‌పై పన్ను చెల్లించకుండా తప్పించుకొన్నట్టు సమాచారం. దాదాపు 45 మంది ప్రముఖులపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తున్నది.

    English summary
    Amala Paul and Fahadh Faasil have been accused of tax fraud, cheating and forgery. Two film actors have been booked for allegedly forging documents and getting their vehicles registered in the union territory of Puducherry to evade motor vehicle tax in Kerala. Police said actors Fahadh Faasil and Amala Paul used fake documents to register their cars in Puducherry to evade the 20 per cent tax in Kerala on luxury cars costing Rs 20 lakh and above.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X