కోరిక తీర్చమని వేధించాడు.. డబ్బులు ఆశచూపాడు.. అమలాపాల్ ఫిర్యాదు.. వ్యాపారవేత్త అరెస్ట్

By Rajababu

Recommended Video

హీరోయిన్‌కు లైంగిక వేధింపులు,మరో హీరోయిన్‌ ని కోరిక తీర్చమని డబ్బులు ఆశ

కోరిక తీర్చాలంటూ ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై దక్షిణాది సినీతార అమలా పాల్ చెన్నైలోని టీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ డ్యాన్స్ షోకు సంబంధించిన రిహార్సల్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొన్నది అని తన ఫిర్యాదులో అమలాపాల్ పేర్కొన్నది. అమల ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

 డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా..

డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా..

మలేషియాలో జరిగే ఓ డ్యాన్స్‌లో పాల్గొనడానికి అమలా పాల్ సిద్ధమవుతున్నారు. అందుకనుగుణంగా ప్రముఖ కోరియోగ్రాఫర్ శ్రీధర్‌కు సంబంధించిన ఓ స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఓ వ్యాపారవేత్త తన వద్దకు వచ్చి అమర్యాదకరంగా ప్రవర్తించారు. తన కోరికను తీర్చమంటూ లైంగికంగా వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

ఒంటరిగా ఉండటం చూసి

ఒంటరిగా ఉండటం చూసి

మీడియా కథనాల ప్రకారం.. స్టూడియోలో నేను డ్యాన్స్ రీహార్సల్ చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒంటరిగా ఉండటం చూసి ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. దాంతో నేను షాక్ గురయ్యాను. భయంతో వణికిపోయాను అని అమలాపాల్ పేర్కొన్నారు.

 మలేషియాలో ఈవెంట్

మలేషియాలో ఈవెంట్

త్వరలోనే నేను మలేషియాకు వెళ్లనున్నాను. ఆ ఈవెంట్ కోసం నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ప్రాక్టీస్ చేస్తుండగా ఓ వ్యక్తి ఈవెంట్‌కు సంబంధించిన వ్యక్తిని చెప్పాడు. ఎవరూ లేని సమయంలో నా పక్కకు వచ్చి అనుచితంగా ప్రవర్తించాడు అని అమలా భయాందోళనలు వ్యక్తం చేసింది.

 ఆ క్షణం భయంతో వణికిపోయా

ఆ క్షణం భయంతో వణికిపోయా

ఆ వ్యక్తిని ఇంతకు ముందు చూడలేదు. ఈవెంట్ వాళ్ల తరపున వచ్చినట్టు ఆయన చెప్పడం చూస్తే నాకు ముందే అనుమానం కలిగింది. ఆ క్షణం నేను అభద్రతాభావంలో పడిపోయాను. ఆందోళనకు గురయ్యాను అని అమలాపాల్ చెప్పింది.

 అందుకే ఫిర్యాదు చేశా

అందుకే ఫిర్యాదు చేశా

ఆ వ్యక్తిపై ప్రవర్తించిన తీరు నాకు ఆవేదన కలిగించింది. నేను ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తున్నాను. నాకు ఎవరూ సహాయకులు లేరు. అందుకే అతడిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చాను. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను అని అమలాపాల్ చెప్పారు.

 వ్యాపారవేత్త అరెస్ట్

వ్యాపారవేత్త అరెస్ట్

అమలాపాల్ ఫిర్యాదు ఆధారంగా అజగేషన్ అనే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కొట్టివక్కమ్‌కు చెందిన వాడిగా గుర్తించారు. అజగేషన్ అరెస్ట్‌ను పోలీసుల కూడా ధృవీకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X