మితిమీరిన హింస, అడల్ట్ కంటెంట్... అమలా పాల్ మూవీకి షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!
అమలా పాల్ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందుతున్న చిత్రం 'ఆడై'... రత్న కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి 'U' లేదా 'U/A' వస్తుందని నిర్మాతలు భావించారు. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు ఏకంగా 'A' సర్టిఫికెట్ ఇచ్చి షాకిచ్చారు.
ఈ చిత్రంలో మితిమీరిన హింస, అడల్ట్ కంటెంట్ ఉండటంతో ఈ మూవీ పెద్దలకు మాత్రమే చూడదగ్గ చిత్రంగా బోర్డ్ సర్టిఫై చేసింది. అయితే ఇలాంటి సర్టిఫికెట్ రావడం వల్ల సినిమాకు వచ్చే ఫ్యామిలీ ప్రేక్షకుల సంఖ్య తగ్గొచ్చని నిర్మాతల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

'ఆడై' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. పోస్టర్లో అమలా పాల్ సెమీన్యూడ్‌గా ఉండటం చూసి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి. కొందరు ఆమెను పోర్న్‌స్టార్ మాదిరిగా ఉన్నావంటూ అసభ్యమైన కామెంట్స్ చేశారు.
'ఆడై' మూవీ రేప్ విక్టిమ్ కథతో సాగుతుందని తెలుస్తోంది. తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ దర్శకత్వం వహిస్తుండగా 'వి స్టూడియోస్' సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











