అతనంటే పిచ్చి.. ఆ అనుభూతి కోసం పడిచస్తున్నా..అమలా పాల్
తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర నటులతో జతకట్టిన అందాల తార అమలాపాల్ ప్రస్తుతం తలా అజిత్‌తో నటించడానికి తహతహలాడుతున్నది. ఇటీవల మీడియాతో ఆమె మాట్లాడుతూ.. అజిత్ సార్‌తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే నటించానికి సిద్ధంగా ఉన్నానను అమలా పాల్ తెలిపింది.

అజిత్‌తో కలిసి నటించాలని ఉంది
అజిత్ చాలా తెలివైన వ్యక్తియే కాకుండా మంచి మనిషి. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అనుభూతి కోసం ఎదురు చూస్తున్నాను. అజిత్‌తో నటించడమంటే కెరీర్‌లోనే గొప్ప అవకాశం అని అమలా పాల్ అభిప్రాయపడింది.

కుటుంబానికి టైమ్ కేటాయిస్తాను
నేను విభిన్నమైన ప్రొఫేషన్‌లో ఉన్నాను. నాకు నా కుటుంబం అవసరం ఎంతో ఉంది. వీలు చిక్కితే కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతాను. షూటింగ్‌లో ఉన్నంత సేపు బయటి ప్రపంచం గురించి ఆలోచించను. ఆ తర్వాత నా వ్యక్తిగత విషయాలకే ప్రాధాన్యం ఇస్తాను అని అమలా పాల్ అన్నారు.

కథ గురించే ఆలోచిస్తాను..
నేను కథ వినేటప్పుడు క్యారెక్టర్ గురించి పట్టించుకొను. నేను కథ మీదే దృష్టిపెడుతాను. అంతే కాకుండా ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా నాకు ముఖ్యం. సుదీర్ఘమైన షెడ్యూళ్ల కోసం వెళ్లేటప్పుడు చిత్ర యూనిట్ గురించి ఆరా తీస్తాను అని అమలా చెప్పారు.

హీరోయిన్ల గురించి చెడుగా
సినిమా పరిశ్రమలో గ్లామర్ తారలపైనే మీడియా ఎక్కువ కన్నేసి ఉంచుతుంది. హీరోయిన్ల మనోభావాలు, వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా వార్తలు రాస్తారు. అలాంటి తీరు చాలా బాధకలిగిస్తుంది. హీరోల విషయానికి వస్తే అలాంటి వార్తలు కనిపించవు అని అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది.

తెలుగులోకి తిరుట్టు పాయలే2
అమలాపాల్ నటించిన తిరుట్టు పాయలే2 చిత్రం డిసెంబర్ 1న రిలీజైంది. ఈ చిత్రానికి సుశీ గణేషన్ దర్శకత్వం వహించారు. ప్రసన్న, బాబీ సింహ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలో తెలుగులోకి కూడా డబ్ కాబోతున్నది. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. సబ్జెక్ట్‌లో ఉండే డెప్త్ ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది అని అమలా పాల్ అన్నారు.


Click it and Unblock the Notifications











