తుక్కు తుక్కు చేస్తా.. మాజీ భర్త రెండో పెళ్లి తర్వాత.. అమలాపాల్ సెన్సేషనల్ ట్వీట్
గ్లామర్ తారగా దుమ్మురేపిన అమలాపాల్ కొద్దికాలంగా స్టార్ రేసులో వెనుకబడిపోయారు. తాజాగా నటిగా పరిణతి చెందిన ఈ బ్యూటీ భారమైన పాత్రలను ఎంచుకొంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇటీవల విడుదలనై ఆడై సినిమ ట్రైలర్‌పై సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అమలాపాల్‌కు ఇటీవల ఓ గట్టి దెబ్బే తగిలింది. చేతిలో నుంచి ఆఫర్ జారిపోవడంతో ఎమోషనల్‌గా స్పందించారు. ఆమె ఏమని స్పందించారంటే..

విజయ్ సేతుపతి మూవీ నుంచి అవుట్
తాజాగా విజయ్ సేతుపతి సినిమాలో కీలక పాత్రను అమలా పాల్ పోషిస్తున్నారు. అయితే ఆడై చిత్రంలో ఆమె నగ్నంగా కనిపించడంతో చిత్ర యూనిట్‌లో అసహనం పేరుకుపోయిందట. దాంతో తమ సినిమాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అమలా పాల్‌ను సినిమాను నుంచి తొలగించారు. ఓ పక్క ఆడై చిత్రంలో అమలాపాల్‌కు ప్రశంసలు లభిస్తుంటే.. సినిమా నుంచి తొలగించడం ఏంటనే చర్చ తీవ్రంగా జరిగింది.

అమలా పాల్‌పై రకరకాల కామెంట్స్
విజయ్ సేతుపతి సినిమా నుంచి అమలా పాల్‌ను తొలగించడంపై రకరకాల కామెంట్లు వినిపించాయి. తనపై వస్తున్న కామెంట్లకు ఆమె ధీటుగా సమాధానం ఇచ్చారు. విజయ్ సేతుపతి సినిమా నుంచి బయటకు తోసేశారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దాంతో మరోసారి ఆమె కామెంట్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ధీటుగా ఎదుర్కొంటాను
ఇక జీవితంలో గానీ, ప్రొఫెషనల్ గానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే.. వాటిని ధీటుగా ఎదుర్కొంటాను. వాటిపై పోరాటం చేస్తాను. నాకు చిన్న, పెద్ద అడ్డంకులు ఎదురైనా తట్టుకొంటాను. సమస్యలను ఎదురొడ్డి వాటిని తుక్కు తుక్కు చేస్తాను. నా శక్తియుక్తులను నా సంతోషానికి, స్వేచ్చుకు ఉపయోగించుకొంటాను అని అమలా పాల్ అన్నారు.
మాజీ భర్త రెండో పెళ్లితో
ఇదిలా ఉండగా, తన మొదటి భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ రెండో పెళ్లి చేసుకోవడంతో కూడా మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో అమలా పాల్, విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లు ఒంటరిగా ఉన్న దర్శకుడు విజయ్ తాను రెండో వివాహం చేసుకొన్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో అమలాపాల్ కూడా పెళ్లి చేసుకొంటారా అనే చర్చ మీడియాలో నడుస్తున్నది.


Click it and Unblock the Notifications











