విజయ్ సేతుపతితో రొమాన్స్‌కు అమలాపాల్ నో.. కారణం ఏమిటంటే!
దక్షిణాది హీరోయిన్ అమలాపాల్ మళ్లీ ట్రాక్‌లో పడినట్టు కనిపిస్తున్నది. ఇటీవల విడుదలైన ఆడై టీజర్‌తో ఆమె మళ్లీ టాప్ గేర్‌లో స్పీడ్ పెంచిందనే ఫీలింగ్ కలుగుతున్నది. ఆడై టీజర్‌లో ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఈ క్రమంలో విజయ్ సేతుపతి సినిమా నుంచి అమలాపాల్ తప్పుకొన్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. దాంతో డైరెక్టర్ వెంకట కృష్ణ రొగత్ సందిగ్ధంలో పడినట్టు సమాచారం.
విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకోవడానికి డేట్స్ సమస్యే కారణమని తెలుస్తున్నది.దాంతో అమలాపాల్ స్థానంలో మరొకరిని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం యువ హీరోయిన్ మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఊటీలో జరిగే షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

తమిళంలో మేఘా ఆకాశ్ మంచి జోరులో ఉన్నారు. పెట్టా, వంత రావతన్ వారవెన్ చిత్రాలతో క్రేజ్‌ను పెంచుకొన్నారు. వాస్తవానికి గౌతమ్ మీనన్ చిత్రం ఎనై నోకి పాయుమ్ తోట చిత్రంపై మేఘా ఆకాశ్ ఆశలు పెట్టుకొన్నారు. కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడంతో కెరీర్‌కు కొంత బ్రేక్ పడింది. అలాగే లై, చల్ మోహన రంగా చిత్రాలు అంతగా ఆశాజనకంగా ఆడకపోవడం కూడా ఇబ్బందిగా మారింది.


Click it and Unblock the Notifications











