»   »  సుచీలీక్స్ పై నోరు విప్పిన అమలాపాల్, నా వీడియో చూడలేకపోయా అంటూ...

సుచీలీక్స్ పై నోరు విప్పిన అమలాపాల్, నా వీడియో చూడలేకపోయా అంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని రోజుల క్రితం సుచీ లీక్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. సింగర్ సుచిత్ర పేరు మీద జరిగిన ఈ లీక్స్ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్, ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష, రానా, సంచిత శెట్టి వంటి టాప్ స్టార్ల ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. ఫోటోలతో పాటు పలువురు స్టార్లకు సంబంధించిన సెన్షేషన్ విషయాలు, షాకింగ్ సీక్రెట్లు సుచీ లీక్స్ ద్వారా బయట పడటంతో యావత్ సినీ లోకం విస్తుపోయింది. తనకు మత్తు మందు ఇచ్చి ధనుష్, అనిరుధ్ సెక్స్ చేశారని, సింగర్ చిన్మయి పెళ్లికి ముందే అనేక సార్లు అబార్షన్ చేయించుకుంది... అంటూ సింగర్ సుచిత్ర సుచి లీక్స్ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఏ సమయంలో ఎవరి ఫోటోలు వస్తాయో

ఏ సమయంలో ఎవరి ఫోటోలు వస్తాయో

దక్షిణాది హీరో, హీరోయిన్లకు సంబంధించి విషయాలు అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఏ సమయంలో ఎవరి ఫోటోలు వస్తాయో అనే భయంతో తారలు గుండెను గుప్పిట్లో పెట్టుకొన్నారు. ఆ వివాదం సమయంలో తమిళనాడులో నెటిజన్లు ట్విట్టర్‌ను కూడా టెలివిజన్‌ చూసినట్టు చూశారనేది అప్పట్లో టాక్.

ముచ్చెమటలు పట్టించింది

ముచ్చెమటలు పట్టించింది

కోలీవుడ్ హీరో ధనుష్‌, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, గాయని చిన్మయి, హన్సిక, త్రిష, ఇతర నటీనటుల ఘాటైన వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ముచ్చెమటలు పట్టించింది సుచిత్ర. అయితే సుచీలీక్స్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన ట్విట్టర్ ద్వారా హ్యాకర్ ఈ పోస్టులు పెట్టినట్లు సుచిత్ర ఇటీవల తెలిపింది.

వణికి పోయారు

వణికి పోయారు

సుచీలీక్స్ ఈ పేరు కోలీవుడ్ నే కాదు మొత్తం దక్షిణాది సినీపరిశ్రమనే ఒక ఊపు ఊపేసింది. ఒక్కొక్క పోస్టూ లో ఒక్కొక్కరీ పేరూ, వారి చీకటి రహస్యం బయటికి వస్తూంటే వచ్చిన వాళ్ళు అవమానం తోనూ, రానివాళ్ళు తమ పేరెక్కడ వస్తుందో అన్న భయం తోనూ వణికి పోయారు.

అమలా పాల్

అమలా పాల్

ఇప్పుడు ఆ పోస్టులు ఆగిపోయినా సింగర్ సుచిత్ర పుట్టించిన ప్రకంపణలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు పాపం ఈ ప్రభావం అమలా పాల్ మీదా పడింది. ధనుష్ తో రాబోతున్న "వడ చెన్నై" నుంచి అమల తప్పుకుంది. ఇంతకీ అమలా పాల్ తప్పుకుందా తీసేసారా అన్న విషయం ఇప్పుడు కోలీవుడ్ హాట్ టాపిక్...

ధనుష్ తో అమల కు ఉన్న సాన్నిత్యమే

ధనుష్ తో అమల కు ఉన్న సాన్నిత్యమే

అసలు అమలా పాల్ విజయ్ ల మధ్య జరిగిన విడాకుల వ్యవహారానికి పక్కా కారణం ఏమిటీ అన్నది ఎవ్వరికీ తెలియకపోయినా ధనుష్ తో అమల కు ఉన్న సాన్నిత్య సంబందమే వీళ్ళ మధ్య ఎడబాటుకు కారణమైందన్న పుకారు అప్పట్లో బలంగా వినిపించింది. అయితే పెద్ద వాళ్ళ వ్యవహారం కావటం తో ఈ సంగతి ఓపెన్ సీక్రెట్ గానే ఉందిపోయింది

వడ చెన్నై

వడ చెన్నై

ఈ గొడవ జరుగుతూండగానే ధనుష్ "వడ చెన్నై" లో హీరోయిన్ గా అమలా పాల్ ని తీసుకున్నారూ అని తెలియగానే అంతా ఒక అభిప్రాయానికి వచ్చేసారు... ఆ తర్వాత సుచీ లీక్స్ తో ఈ అనుమానం మరింత బలపడింది. విఐపి(రఘువరన్ బీటెక్ ) తర్వాత 'వడ చెన్నయ్‌' చిత్రంలోను అమలా పాల్‌ని ధనుష్‌ కథానాయికగా తీసుకోవడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.

డేట్లు కుదరకనే

డేట్లు కుదరకనే

అయితే సడన్‌గా కొన్నాళ్ళ క్రితం ఈ చిత్రం నుంచి అమల వాకౌట్‌ చేసింది అన్న వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. అమల సడన్‌గా ఉన్నట్టుండీ ఈ ప్రాజెక్ట్‌నుంచి ఎందుకు తప్పుకుందనేది తెలీదు. డేట్లు కుదరకనే అని కవర్ చేస్తున్నారు గానీ అసలు ఆఫర్లే లేని అమలా పాల్ కి డేట్ల సమస్య అనటమే వింతగా ఉంటే. అసలు ముందు సైన్ చేసాక ఈ డేట్ల సమస్య ఎలావచ్చిందంటూ అనుమానంగా చూసారు కోలీవుడ్ జనాలు

మళ్ళీ తేనెతుట్టెని కదిపింది

మళ్ళీ తేనెతుట్టెని కదిపింది

సరే ఆ విశయాలన్నీ ముగుసి పోయాయ్, సుచిత్రనీ, సుచీలీక్స్ నీ జనం ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు, అంతా చల్లబడుతున్న సమయం లో అమలా పాల్ మళ్ళీ ఇప్పుడీ తేనెతుట్టెని కదిపింది. చివరి దశలొ ధనుష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో అమలాపాల్ చేసిన రాసలీలలు ఒక ఆదివారం నాడు బయటపెడతానంటూ ప్రకటించింది.

చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను

చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను

ఆ తర్వాత సుచిత్ర కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏ వీడియో కనిపించలేదు. ఇంతకాలం దీని గురించి స్పందించని అమలా పాల్‌ 'విఐపి 2' ప్రమోషన్స్‌లో మీడియాకి దొరికింది. ఈ సందర్భంగా ఆమెతో ఈ వీడియోల ప్రస్తావన వస్తే ''ఆ వీడియోలు చూద్దామని నేను కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను.

సుచిత్ర దగ్గర ఏ వీడియోలు లేవు

సుచిత్ర దగ్గర ఏ వీడియోలు లేవు

ఎన్ని ఆదివారాలు గడిచినా ఆ వీడియోలు ఇంకా బయటకి రాలేదేంటో?'' అంటూ వెటకారంగా స్పందించింది. సుచిత్ర దగ్గర ఏ వీడియోలు లేవని, కేవలం గిమ్మిక్స్‌ చేసిందని అమల అంటోంది. హ్మ్..! నమ్మొచ్చా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పటికీ ఏదో ఒక ఫేక్ అకౌంట్ నుంచి సుచీలీక్స్ అనే హాష్ ట్యాగ్ తో వీడియోలు వస్తూనే ఉన్నాయి మరి. మొత్తానికి సుచీలీక్స్ అనేది ఇప్పట్లో జనం మర్చిపోవటం అన్నది కష్టమే

English summary
Amala said that even she is also waiting for that video of her but unfortunately no videos were released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu