twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది ఫేక్ రిజిస్ట్రేషన్? ఇంటలిజెన్స్‌నే పక్కదారి పట్టించిన అమల?: హీరోయిన్ పై చట్టపరమైన చర్యలు

    విదేశాల నుంచి బెంజ్‌ లగ్జరీ కారును సుమారు రూ. కోటికి పైగా చెల్లించి సినీ నటి దిగుమతి చేసుకుంది. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మాత్రం చెల్లించలేదని తేలింది.

    |

    కోట్ల కొద్ద్దీ డబ్బు ఉన్నా మన సినిమా తారలూ, సెలబ్రిటీలూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులని ఎగ్గొట్టటానికి ఎన్ని రకాల పక్కదారు అనుసరిస్తారో చెప్పటానికి ఈ ఒక్క ఉదంతం ఉదాహరణ. కోటి రూపాయలకు పైగానే విలువైన వాహనాన్ని కొన్నా ఇరవైలక్షల పన్ను ఎగ్గొట్టటానికి మన హీరోయిన్ గారు చేసిన మోసం ఇంటలిజెన్స్ కళ్ళని దాటి పోలేదు. దీంతో ఆమె మీద చట్టపరమైన చర్యలు సిద్దమయ్యారు అధికారులు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఏం జరిగిందీ అంటే.

    బెంజ్‌ లగ్జరీ కారు

    బెంజ్‌ లగ్జరీ కారు

    విదేశాల నుంచి బెంజ్‌ లగ్జరీ కారును సుమారు రూ. కోటికి పైగా చెల్లించి సినీ నటి అమలాపాల్‌ దిగుమతి చేసుకుంది. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మాత్రం చెల్లించలేదని తేలింది. ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో వివాహం చేసుకుని, ఆపై విడాకులు తీసుకున్న అమలాపాల్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీగా కనిపిస్తోంది.

    పన్ను ఎగ్గొట్టటానికి

    పన్ను ఎగ్గొట్టటానికి

    చేతినిండా ఆఫర్లతో దూసుకెళ్తున్న అమలాపాల్ మార్కెట్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయినా సరే ఆమె ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుల విష్యం లో మాత్రం దొంగ దారినే అనుసరించింది. విదేశాలనుంచి కారుని దిగుమతి చేసుకున్న ఈ హీరోయిన్ పన్ను ఎగ్గొట్టటానికి రిజిష్ట్రేషన్ లో మాత్రం ఒక అడ్డాదారినే అనుసరించింది.

    రెవెన్యూ ఇంటెలిజెన్స్‌

    రెవెన్యూ ఇంటెలిజెన్స్‌

    ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం అధికారికంగా ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలిపింది. కేరళకు చెందిన అనేకమంది ప్రముఖులు, సెలెబ్రిటీలు విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారు. వీరిలో చాలామంది పన్ను చెల్లించలేదని రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారుల కనుగొన్నారు.

     ఇంజనీరింగ్ విద్యార్థి పేరుమీద రిజిస్ట్రేషన్

    ఇంజనీరింగ్ విద్యార్థి పేరుమీద రిజిస్ట్రేషన్

    దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేరళ ప్రభుత్వం నుంచి కోరగా, వారు అందజేశారు. ఈ జాబితాలో నటి అమలా పాల్‌ పేరు కూడా ఉన్నట్టు తేలింది. ఈమె విదేశాల నుంచి బెంజ్‌ కారును విదేశాల నుంచి కొనుగోలు చేసి పుదుచ్చేరిలోని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలింది.

    20 లక్షల మేరకు పన్ను ఎగవేసి

    20 లక్షల మేరకు పన్ను ఎగవేసి

    దీంతో పుదుచ్చేరిలో కారును రిజిస్ట్రేషన్‌ చేసి, కేరళలో నడుపుతున్నట్టు అధికారులు నిర్థారణ అయ్యారు. ఇలా చేయడం వల్ల ఆమె ఏకంగా రూ.20 లక్షల మేరకు పన్ను ఎగవేసినట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు వెల్లడించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు వారు సమాయత్తమవుతున్నారు.

    English summary
    Prominent people in Kerala evade tax worth crores of rupees by registering their vehicles in Pondicherry so as to avail the low taxes in the union territory. The S class Benz, costing more than Rs 1 crore, owned by actor Amala Paul is registered in Pondicherry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X