»   » మాజీ భర్తకు రెండో పెళ్లి.. అమలా పాల్ మనస్తాపం.. షూటింగ్ వదిలేసి..!

మాజీ భర్తకు రెండో పెళ్లి.. అమలా పాల్ మనస్తాపం.. షూటింగ్ వదిలేసి..!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Amala Paul Gets Hurted With A L Vijay second Marraige Topic

  అందాల తార అమలా పాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. అమలా పాల్‌తో వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో కొద్దికాలంగా వారు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. తాజాగా వారికి విడాకులు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్త బయటకు పొక్కింది. అయితే ఆ వార్తపై విజయ్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..

  అమలా పాల్‌కు విడాకులు

  అమలా పాల్‌కు విడాకులు

  విజయ్, అమలా పాల్‌కు రెండు వారాల క్రితం చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కేసు కోర్టులో ఉండగానే విజయ్ తండ్రి తన కుమారుడి కోసం వధువును వెతుకుతుండటం మీడియాకు తెలిసింది. దాంతో విడాకులు లభించగానే విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త రూమర్‌గా మారింది.

  అమలా పాల్ మనస్తాపం

  అమలా పాల్ మనస్తాపం

  అయితే విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తతో అమలా పాల్ మనస్తాపానికి గురైంది. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న అమలా పాల్ అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది అని తమిళ పత్రికలు కోడై కూసాయి. విడాకులు పొందిన తర్వాత కూడా అమలా పాల్ ఇంకా విజయ్‌ గురించే ఆలోసిస్తున్నది అని కథనాల్లో పేర్కొన్నారు.

  ఏఎల్ విజయ్ ఖండన

  ఏఎల్ విజయ్ ఖండన

  ఈ నేపథ్యంలో దర్శకుడు విజయ్ స్పందిస్తూ.. నా రెండో పెళ్లి గురించి మీడియాలో కథనాలు వచ్చినట్టు తెలిసింది. కానీ ఆ వార్తలో వాస్తవం లేదు. అవాస్తవ కథనాలతో నేను కలత చెందాను అని విజయ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. మీడియా తీరుపై కొంత నిరసన వ్యక్తం చేశారు.

  అడిగి తెలుసుకొంటే బాగుండేది

  అడిగి తెలుసుకొంటే బాగుండేది

  నా కెరీర్ పురోగతి చెందడానికి మీడియా నాకు చాలా సహకారం అందించింది. మీడియా అంటే నాకు గౌరవం. కానీ నాకు సంబంధించిన వార్తను అడిగి తెలుసుకొని రాస్తే బాగుండేది. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే. పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికి అబద్ధం అని విజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.

  English summary
  Amala Paul's ex-husband, Tamil Director AL Vijay planning second marriage. The director has issued a press statement in order to put all the rumours to rest. Terming media reports on his remarriage as “baseless,” Vijay said, “To my dismay, I found that in a certain section of media there were some fabricated rumours on my remarriage. This is baseless. This sort of unchecked and unauthorised information disturbs me a lot.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more