అమలాపాల్ తో దర్శకుడు ఎఫైర్...సెట్ లో సేవలు
చెన్నై : అమలా పాల్ కెరీర్ తో పాటు లవ్ ఎఫైర్స్ కు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లుంది. అయితే మీడియా వద్ద మాత్రం తనకింకా ప్రేమించే వయసు రాలేదని అంటోంది . విజయ్ దర్శకత్వంలో 'దైవతిరుమగళ్'లో కనిపించిన ఆమె ప్రస్తుతం ఆయన నిర్దేశకత్వంలోనే విజయ్‌కు జంటగా 'తలైవా' చిత్రీకరణలో తీరికలేకుండా ఉంది. దర్శకుడు విజయ్, అమలాపాల్ సన్నిహితంగా ఉన్నారని, ప్రేమలో పడ్డారంటూ 'నాన్న ' షూటింగ్ సందర్భంగా వార్తలు షికార్లు చేశాయి.
ప్రస్తుతం అమలాపాల్‌కు విజయ్ మరో అవకాశం ఇవ్వటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇందుకుతోడు 'తలైవా' సెట్‌లో అమలాపాల్‌పై దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడట. సమయానికి భోజనం సిద్ధం చేయటం, పని మనుషులను పురమాయించి కావాల్సిన సేవలు చేయిస్తున్నాడట. అయితే తమపై వస్తున్న వార్తలను అమలాపాల్ ఖండిస్తోంది.
అమలాపాల్ మాట్లాడుతూ.. కథానుగుణంగా వెండితెరపై పరిణతి గల పాత్రల్లో కనిపిస్తాను. నిజ జీవితంలో నేనింకా చిన్నపిల్లనే. ప్రేమించే వయసు రాలేదు. దర్శకుడుకీ,హీరోయిన్ కి మధ్య ఉండే రిలేషన్ మాత్రమే మా ఇధ్దరి మధ్య ఉంది. అంతకు మించి ఊహలు అనవసరం అంటూ తేల్చి చెప్పింది.
ఇక మొన్నీ మధ్యన రామ్ చరణ్ తో నాయక్ లో అదరకొట్టిన అమలాపాల్ ఇప్పుడు అల్లు అర్జున్ తన తాజా చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' లో చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె కత్తి తో విన్యాసాలు చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతోంది. ఒకేసారి రెండు కత్తులు పట్టుకుని ఆమె అదరకొట్టనుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కిచా(తుపాకి,బిల్లా 2, విశ్వరూపం ఫేమ్) ఈ ఫైట్స్ ని జనరంజకంగా తీస్తున్నారు.


Click it and Unblock the Notifications











