అమలాపాల్‌ కి రెండు మంచి ఆఫర్స్

By Srikanya

చెన్నై : నాన్న, ఇద్దరమ్మాయిలతో ,బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, నాయిక్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన హీరోయిన్ ...అమలా పాల్. అయితే ఆమెకు తెలుగు నుండి ఆమెకు సరైన ఆఫర్స్ రావటం లేదు. దాంతో తమిళం వైపే మళ్లీ మ్రొగ్గుచూపింది. తాజాగా తమిళ తెరపై ప్రభంజనం సృష్టిస్తున్న హీరో శివకార్తికేయన్ తో ఆమె కమిటైంది‌. శివ తొలిసారిగా పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నాడు. తరచూ హాస్య పాత్రల్లో కనిపిస్తున్న తాను.. భిన్నంగా కనిపించాలనే ఈ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే మోహన్ లాల్ తో ఓ మళయాళ చిత్రం సైతం కమిటైంది

ప్రస్తుతం 'మాన్‌ కరాటే'లో హన్సికతో జోడీ కట్టాడు. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 'ఠాణా' పేరిట కొత్త చిత్రంలో నటించేందుకూ సిద్ధమయ్యాడు. ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా అమలాపాల్‌ ఎంపికైంది. ధనుష్‌ సారథ్యంలోని వండర్‌ బార్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం జయంరవి జంటగా అమలాపాల్‌ 'నిమిందు నిల్‌', 'వేలై ఇల్లా పట్టదారి'లో నటిస్తోంది. ఇవి పూర్తయ్యాక 'ఠాణా' చిత్రీకరణలో పాల్గొననుంది.

ప్రేమఖైదీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కోచ్చి సుందరి అమలాపాల్‌. ఆ చిత్రంలో ఓ గ్రామీణ యువతి పాత్రలో సహజసిద్ధంగా నటించి మెప్పించింది ఈ సుందరి. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్యతో 'బెజవాడ'లో నటించే అవకాశం సైతం దక్కించుకుందీ భామ. ఇతర కథానాయకల్లా గ్లామరస్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న స్క్రిప్టులను ఎంపికచేసుకుని తెలివిగా ముందడుగేస్తోందీ సుందరి.

తొలిచిత్రంతోనే జాతీయ అవార్డ్‌ అందుకోవడమే గాకుండా ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్‌కు కూడా నామినేట్‌ అయ్యింది. ఇటీవల 'దైవ తిరుమగల్‌'తో తమిళంలో విజయాన్ని నమోదుచేసుకుంది. అదే సినిమా తెలుగులో 'నాన్న'గా విడుదలై ..ఇక్కడా గుర్తింపును పెంచింది. ఇద్దరమ్మాయిలతోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన నాయిక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X