నాని సినిమా రీమేక్‌లో అమలా పాల్.. ఆ పాత్రలో కనిపించనున్న బ్యూటీ
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా నానిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇందులో నాని నటనకు, పలికించిన హావభావాలకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ మంచి ఫలితాలనే అందుకుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అందుకే ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 'జెర్సీ'ని హిందీలోకి తీసుకెళ్లేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరే తెరకెక్కించనున్నారని తెలిసింది. అలాగే, ఈ సినిమాకు వరుణ్ ధావన్, షాహీద్ కపూర్‌లలో ఒకరిని తీసుకోవాలని ఈ ఇద్దరు నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

అలాగే, ఇదే సినిమాను తమిళంలోనూ తీయాలని సురేష్ ప్రొడక్షన్స్ భావిస్తోందట. ఈ చిత్రం ద్వారా ప్రముఖ హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా మారబోతున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్.. నాని పాత్రను పోషిస్తారని సమాచారం. విష్ణు స్వతహాగా క్రికెట్ ప్లేయర్ కావడంతోనే రానా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
తాజాగా ఈ తమిళ రీమేక్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అమలా పాల్‌ను తీసుకుంటున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని సమాచారం. దీనికి ఆమె ఓకే చేసేసిందని కోలీవుడ్‌లో అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవల 'అడై' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమలా పాల్. ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ కలెక్షన్లను మాత్రం బాగానే తెచ్చుకుంది. దీంతో అమల ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సినిమా తర్వాత కొన్నింటిని ఓకే చేసినప్పటికీ అవేమీ పట్టాలెక్కలేదు.


Click it and Unblock the Notifications











