'బెజవాడ' సినిమా ఒప్పుకోవటమే పెద్ద తప్పు

By Srikanya

తాను రామ్ గోపాల్ వర్మ తీసిన బెజవాడ చిత్రంలో నటించటానికి ఒప్పుకోవటమే పెద్ద తప్పు చేయటమని అమలా పౌల్ అంది. ఆమె మీడియా తో మాట్లాడుతూ...తాను వర్మ సినిమా అనే కేవలం ఒప్పుకున్నానని అంది. తనకు ఆ సమయంలో బయట చాలా ఆఫర్స్ వచ్చినా వర్మ సినిమా కదా అని వాటిని అన్నిటినీ వదులుకున్నానని అంది. బెజవాడకు ముందు తెలుగు నిర్మాతలు, దర్శకులు నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయని, అయితే ఇప్పుడు అవన్నీ మిస్సయ్యానని అని ఆవేదనతో చెప్పుకొచ్చింది.

నాగచైతన్య హీరోగా, వివేక్ కృష్ణ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ బెజవాడ చిత్రం రూపొందింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. కథ, కథనాలు సరిగ్గా లేకపోవటం, టెక్నికల్ గా నాశిరకంగా ఉండటంతో మొదటి రోజే బాక్స్ లు వెనక్కి వెళ్లిపోయే పరిస్దితి వచ్చింది. దానికి తోడు వర్మ .. బెజవాడ టైటిల్ ని టార్గెట్ చేస్తూ విపరీతమైన హైప్ క్రియేట్ చేసారు. ఆ హైప్ కి తగ్గట్లు సినిమా లేకపోవటం చాలా మందిని నిరాశపరిచింది.

నాగచైతన్యను సైతం ఈ చిత్రం బాగా దెబ్బతినటంతో యాక్షన్ హీరోగా ఎదుగుదామనే ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మాత్రం అమలా పౌల్ మాత్రమే. విక్రమ్ తో చేసిన నాన్న చిత్రం చూసిన వాళ్లు ఆమెకు వరసగా ఆఫర్స్ ఆఫర్ చేసారు. అయితే ఆమె వెంటనే వర్మ సినిమా ఒప్పుకుని వాటిని రిజెక్టు చేసింది. దాంతో బెజవాడ రిజల్టు చూసిన వాళ్ళు ఆమెతో సినిమా చేయటానికి ఆసక్తి చూపటం లేదు.

ఇక ఆమె తాజాగా రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రకు ఆమెను తీసుకున్నారు . అలాగే 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' లో వెంకటేష్ సరసన అడిగారు. అయితే ఆమె రిజక్టు చేసింది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ...నాకు నటించే అవకాశం వస్తే వదులుకోవటానికి కారణం మహేష్‌బాబుకి వదినగా నటించడం ఇష్టం లేకపోవడం వల్ల కాదు అంటోంది. ఈ విషయమై చెప్తూ...నేనూ, దర్శకుడు పరస్పరం చర్చించుకొన్న తరవాతే... ఆ సినిమా నుంచి తప్పుకొన్నాను. అంతేగానీ వదిన పాత్ర నచ్చక కాదు. నేను ఇక్కడకు వచ్చింది నటించడానికే అంది.

హీరోయిన్ అంటే అందాల ఆరబోత అనే సిద్ధాంతానికి నేను దూరం..నాలుగు పాటల్లో కనిపించడానికి నేనే అక్కర్లేదు. అందుకు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఈ రోజుల్లో హీరోయిన్స్ కు నటించే అవకాశం చాలా తక్కువ. అందుకోసం హీరోయిన్స్ ప్రాధాన్యం ఉన్న కథలపైనే ఆధారపడతారు. అవి తరచూ రావు కదా. అందుకే ఏదైనా అవకాశం ఉన్నప్పుడే నటించేయాలి అంది. ఆమె రీసెంట్ గా సిద్దార్ద లవ్ ఫెయిల్యూర్ లో మోడ్రన్ పార్వతిగా కనిపించి అలరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X