ఆ ముద్దుతో...అమల-ఆర్య మధ్య చెడిందా?
ఆర్య అలా మాట్లాడటంతో అమలాపాల్ చాలా అప్ సెట్ అయిందని, ఆమె మనసు గాయపడిందని కోలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. అప్పటి నుంచి అమలు ఆర్యతో అసలు మాట్లడటమే మానేసిందట. ఇటీవల ఆర్య ఇంట్లో జరిగిన ఓ వేడుకకు కూడా హాజరు కాలేదు. దీన్ని బట్టి ఇద్దరి మధ్య స్నేహ బంధం కట్టయిందని, ఇకపై ఇద్దరూ కలిసి నటించడం కూడా డౌటే అంటున్నారు. అయితే అమల పాల్ మాత్రం ఈవార్తలను ఖండిస్తోంది. అలాంటిదేమీ లేదని, తాను ఆ సమయంలో దుబాయ్‌లో ఉండటం వల్లనే హాజరు కాలేకపోయానని అంటోంది.
కాగా... 'వెట్టై' తెలుగులో 'భలే తమ్ముడు'గా అనువదించనున్నారు. ఈ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులు దక్కించుకోవడానికి పలువురు తెలుగు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications












