కృష్ణుడుతో సినిమా చేసిన డైరక్టర్ కి స్టార్ హీరో డేట్స్...
మా సినిమా తొలికాపీ చూసిన ఆర్.బి.చౌదరిగారు నన్ను అభినందించారు. తమిళంలో మా బ్యానర్‌లో విజయ్ హీరోగా సినిమా చేద్దువుగానీ... కథ సిద్ధం చేసుకో అని అన్నారు. దాంతో నా నమ్మకం పదింతలైంది. కృష్ణుడు కెరీర్‌లో మంచి కమర్షియల్ హిట్ అవుతుందని అన్నారు అని ఆనందపడుతూ చెప్తున్నారు 'అమాయకుడు' దర్శకుడు భారతిగణేష్. కృష్ణుడు, అనన్య, పూనమ్ సింగార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'అమాయకుడు'. ఆక్టగాన్ మూవీస్ పతాకంపై భారతిగణేష్ దర్శకత్వం వహించారు. బాల మురుగన్, అనిల్ నాయర్, సుదర్శన్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జులై లో విడుదల కానుంది. అలాగే 'అమాయకుడు'...ఫ్యామిలీ సెంటిమెంట్, ప్రేమ, వినోదం కలగలిసిన చిత్రం అనీ, భావోద్వేగాలకు పెద్ద పీట వేసిన సినిమా ఇదని కృష్ణుడు పేర్కొన్నారు.
కృష్ణుడు అమాయకుడు భారతి గణేష్ పూనమ్ సింగార్ వినాయకుడు krishnudu amayakudu bharathi ganesh poonam singar vinayakudu


Click it and Unblock the Notifications