twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటిల్ మార్చే ప్రసక్తి లేదని దర్శకుడు..వివాదం

    By Srikanya
    |

    చెన్నై : మరో చిత్రం టైటిల్ వివాదం ముదురుతోంది. తమిళ చిత్రం ఆదిభగవాన్ టైటిల్ మార్చమని హిందూ సంఘాలు కంప్లైంట్ చేసిన నేపధ్యంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని చిత్ర దర్శక నిర్మాతలు చర్చించి పరిష్కరిస్తారని హీరో జయం రవి పేర్కొన్నారు. కానీ దర్శకుడు అమీర్ మాట్లాడుతూ ఆది భగవాన్ టైటిల్‌ను మార్చే సమస్యే లేదని చెప్పారు. దాంతో కోర్టులోనే తేల్చుకుంటామని అంటున్నారు.

    రిలీజ్ అవుతున్న లేదా కాబోతున్న ప్రతీ చిత్రం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటోంది. తాజాగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న తమిళ చిత్రం ఆదిభగవాన్ చిక్కుల్లో పడింది. ఇప్పటికే ముస్లిం సంఘాలు వ్యతిరేకత తెలపడంతో విశ్వరూపం చిత్రాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఆదిభగవాన్ చిత్రంలో హిందువులను కించపరిచే సన్నివేశాలున్నాయంటూ సుప్రీం కోర్టు న్యాయవాదులు కృష్ణమూర్తి, దురై సెల్వన్ సోమవారం చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

    ఆది భగవాన్ అనే పేరు హిందువుల ఆరాధ్య దేవుళ్లు అయిన వినాయకుడు, శివుడికి వర్తిస్తుందని వెల్లడించారు. ఈ చిత్రంలో హిందువుల దేవతలను అవమానించే సన్నివేశాలు ఉన్నాయని అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. ఆదిభగవాన్ చిత్రానికి సెన్సార్‌కు ముందుగా తమకు చూపించాలని కోరుతున్నామని తెలిపారు. అదే విధంగా ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులు, హిందూ మత ప్రతినిధులకు చిత్రాన్ని చూపాలని, ఆదిభగవాన్ అనే టైటిల్‌ను మార్చాలని కోరారు.

    ఆది భగవాన్ చిత్రం పేరును మార్చే సమస్యే లేదంటున్నారు ఆ చిత్ర దర్శకుడు. కమల్‌హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం ముస్లింల వ్యతిరేకతకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటి సమస్యనే ఆదిభగవాన్ ఎదుర్కొంటోంది. ఈ చిత్రాన్ని హిందూ మతస్తులు వ్యతిరేకిస్తున్నారు. జయంరవి, నీతూచంద్ర జంటగా నటించిన చిత్రం ఆదిభగవాన్. అమీర్ దర్శకుడు. ఆది భగవాన్ ఎదుర్కొంటున్న సమస్య వ్యవహారం గురించి చిత్ర హీరో జయం రవి స్పందిస్తూ ఈ వార్తలు చూసి చాలా ఆశ్చర్యపోయానన్నారు. ఇందులో ఒక చిన్న షాట్ కూడా ఏ మతానికి వ్యతిరేకంగా లేదన్నారు.

    అదే విధంగా ఆదిభగవాన్ చిత్రాన్ని యూనిట్ సభ్యులు మినహా ఇతరులెవ్వరూ చూడలేదన్నారు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆది కాబట్టి చిత్ర టైటిల్‌ను ఆది భగవాన్‌గా నిర్ణయించామన్నారు. చిత్రం చూస్తే ఈ విషయం అర్థం అవుతోందన్నారు. చిత్రం నిర్ణయించిన విధంగా ఈ నెలలోనే విడుదలవుతుందని చెప్పారు.

    English summary
    Ameer’s Aadhi Bhagavan has been in the eye of a storm at the moment with regard to its title. While some feel that Ameer’s film is intentionally being targeted, asking for the title to be changed, the director of the film is firm in his decision to retain the title of the film. The star of the film Jayam Ravi too has spoken out on this matter saying that the film has nothing to do with any religion and the title is based on the name of the central character Aadhi. The director says that the film is a full-on commercial entertainer. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X