రజనీకాంత్ 'రోబో' ఆడియో ఫంక్షన్ ఛీఫ్ గెస్ట్ ఎవరంటే
రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న రోబో చిత్రం ఆడియో వేడుకకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఛీప్ గెస్ట్ గా అటెండవనున్నారు. ఈ చిత్ర హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మామగారైన అమితాబ్ ని మించిన అతిధిగా ఎంచుకోవటం పలు వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో పంక్షన్ జూలై 31న కౌలాలంపూర్..మలేషియాలో జరగనుంది. మలేషియా రజనీకాంత్ కి అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతం కావటంతో ఇక్కడ ఆడియో పంక్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెబిఓ గ్రూప్ వారు ఈ ఆడియో పంక్షన్ ని సమర్పించనున్నారు. అలాగే ఈ ఆడియో పంక్షన్ లో ఎఆర్ రహమాన్ ఓ ప్రత్యేకమైన కల్చరల్ పోగ్రామ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు చివరి వారంలో ఈ చిత్రం రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం రైట్స్ ఏడు కోట్లకు అమ్ముడయి రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రం ఆడియో రైట్స్ ని ధింక్ మ్యూజిక్ వారు భారీ పోటీని ఎదుర్కొని సొంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











