Rajini 170: 32 ఏళ్ల తర్వాత రజినీ మూవీలో మెగాస్టార్.. మరో ఇద్దరు హీరోలు కూడా!
విభిన్నమైన సినిమాలతో పాటు విలక్షణమైన శైలితో ప్రత్యేకతను చాటుకుంటూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా సౌతిండియాలో సూపర్ స్టార్‌గా సత్తా చాటుతున్నారు తలైవా రజినీకాంత్. వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలే ఆయన 'జైలర్' అంటూ వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో రూ. 600 కోట్లు పైగా వసూళ్లు లభించాయి. దీంతో ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో రజినీకాంత్ మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు.
'జైలర్' మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తన కొత్త సినిమాలను కూడా ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఇందులో భాగంగానే ఆయన తన 170వ చిత్రాన్ని 'జై భీమ్' ఫేం టీజే జ్ఞానవేల్‌తో చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. పైగా దీన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. అప్పటి నుంచి ఈ మూవీ గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో నటించే స్టార్ల వివరాలను నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది.

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారు. దీంతో వీళ్లిద్దరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అమితాబ్ మాత్రమే కాదు..ఈ సినిమాలో తెలుగు హీరో రానా దగ్గుబాటితో పాటు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. వీళ్లందరికీ స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. దీంతో ఈ క్రేజీ కాంబో మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో టీజే జ్ఞానవేల్ రూపొందించే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈరోజు నుంచే ప్రారంభం అవుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











