twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ ‘రోబో’ లో బిగ్ బి గెస్ట్ రోల్..!?

    By Sindhu
    |

    సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో 'రోబో" చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి రోజుకో విషయం అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ షికారు చేస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజినీని మరింత అందంగా చూపించడానికి శంకర్ తనదైన శైలిలో ప్రయత్నించనున్నారు. ఇప్పటికే వీరిద్దరి దర్శకత్వంలో వచ్చిన 'శివాజీ" చిత్రం సాందించిన విజయం అందరికీ తెలిసిందే.

    రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఓ కొత్త విషయం కోలీవుడ్ లో మహాజోరుగా వినిపిస్తోంది. రోబో చిత్ర షూటింగ్ ఇటీవల చెన్నయ్ లో జరిగినప్పుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అక్కడికి వెళ్లారని సమాచారం. ఆ సన్నివేశాల చిత్రీకరణ తిలకించారని సమాచారం. ఇదిలా ఉంటే 'రోబో" లో అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ చేస్తున్నారని, అందుకే చెన్నయ్ కి వెళ్లి ఈ యూనిట్ ను కలిశారని సమాచారం. సైంటిస్ట్ గా నటిస్తున్న రజనీకి ఫ్రెండ్ పాత్రలో అమితాబ్ కనిపిస్తారట. దాదాపు 125కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    అయితే ప్రస్తుతం ఐశ్వర్య మామ అమితాబ్ నటించనున్నారని చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఆగి ఐశ్వర్య భర్త అభిషేక్ సైతం రోబోలో కనిపిస్తారని చెబుతారేమో అని తమిళ తంబిలు జోక్ లు వేసుకొంటున్నారు. కానీ మరికొందరు ఈ జోక్ నిజమైన అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా అనుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్‌లో ఈ ఫ్యామిలీ ఇలా కలిసే నటిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అందుకే ఒకరి తర్వాత ఒకరుగా రోబోలో కూడా దర్శనమిస్తారేమో అని వారు చెప్పుకుంటున్నారట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X