తమిళంలో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్

By Bojja Kumar

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ త్వరలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా' సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తమిళంలో కూడా ఆయన అడుగు పెట్టబోతున్నారు. కోలీవుడ్లో ఎస్‌జె సూర్యతో కలిసి బిగ్‌ బి నటించబోతున్నారు. 'ఉయర్నద మణిదన్' టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రానికి థా తమిళ్వానమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఎస్.జె సూర్య ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు.

బిగ్ బి, ఎస్‌జె సూర్య కలిసి ఉన్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎస్.జె సూర్య ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Amitabh Bachchan all set for Tamil debut

'ఉయర్నద మణిదన్' చిత్రం తమిళ, హిందీలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి హిందీలో అడుగు పెడుతుండటం ఆనందంగా ఉంది. దేవుడి దయ వల్లనే ఇదంతా జరిగిందని భావిస్తున్నాను. మా మూవీ పోస్టర్ విడుదల చేసి నన్ను ఆశీర్వదించిన రజనీకాంత్ సర్‌కు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

'ఉయర్నద మణిదన్' చిత్రంలో ఎస్‌జె సూర్య లీడ్ రోల్ పోషిస్తున్నారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఒక విభిన్నకథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అమితాబ్ నటిస్తున్న తొలి తమిళ చిత్రం కావడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X