సూపర్ స్టార్ రజని బర్త్ డే.. మహేష్, అమితాబ్, కమల్ ఏమన్నారో తెలుసా!
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వినగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయే అభిమానులు ఉన్నారు. రజని స్టైల్ ఆయన్ని వెండి తెరపై సూపర్ స్టార్ ని చేస్తే.. నిడారంబరత కోట్లాది మంది ప్రజల ఆదరణ పొందడానికి కారణం అయింది. నేడు రజనీకాంత్ జన్మదినం. ఈ పుట్టిన రోజుతో రజనీకాంత్ 68వ పడిలోకి అడుగుపెడుతున్నారు. రజనీకాంత్ పుట్టిన రోజుని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటాయి. సినీ ప్రముఖులంతా రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కొన్ని తరాలకు మీరు స్ఫూర్తి దాయకం
సూపర్ స్టార్ మహేష్ బాబు రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీకాంత్ సర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కొన్ని తరాలకు స్ఫూర్తి దాయకం. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
అతడొక సంచలనం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సూపర్ స్టార్ రజనితో ఉన్న కొన్ని మధురమైన ఫోటోలు షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. నా స్నేహితుడు, సహచరుడు, ఒక సంచలనం అయిన రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. పలు చిత్రాల్లో రజని, అమితాబ్ కలసి నటించారు.

జైత్ర యాత్రని కొనసాగిద్దాం
ఇక రజనీకాంత్ చిరకాల మిత్రుడు కమల్ హాసన్ కూడా ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా మిత్రుడు రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన జైత్ర యాత్రని ఇలాగే కొనసాగిద్దాం అనికమల్ హాసన్ తెలిపారు. కెరీర్ ఆరంభంలో రజని, కమల్ కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయాల్లోకి ఎంటర్ కావడం ఆసక్తికలిగించే అంశం.
హీరోయిన్లు ఇలా
హీరోయిన్లు నుంచి కూడా సూపర్ స్టార్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్ లాంటి భామలు రజనీని 68 68 వ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి, మనందరి సూపర్ స్టార్ రజని సర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది. హ్యాపీ బర్త్ డే రజని సర్.. నాకు మీరే ఎల్లప్పుడూ ఆదర్శం అంటూ ఐశ్వర్య రాజేష్ విష్ చేసింది.


Click it and Unblock the Notifications











