»   » రోబో-2: అమీ జాక్సన్ తీసేయకుంటే రజనీ, శంకర్ పై దాడి చేస్తాం!

రోబో-2: అమీ జాక్సన్ తీసేయకుంటే రజనీ, శంకర్ పై దాడి చేస్తాం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శంకర్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘రోబో-2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘2.0' టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమీ జాక్సన్ ఎంపికయింది.

అయితే ఓ వివాదం కారణంగా ఇపుడు తమిళనాడులో ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు అక్కడివారు. అంతేకాదు.... రోబో-2 సినిమా నుండి ఆమెను తీసేయాలని, లేకుంటే దాడి చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి.

Amy Jackson gets into trouble over tweet on 'Jallikattu' ban in Tamil Nadu

తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు గతంలో నిషేధం విధించింది. దీనిని ఎత్తివేయాలంటూ తమిళనాట ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొంతమంది బాలీవుడ్ నటులు దీనిని వ్యతిరేకిస్తూ, మూగజీవాలను హింసించరాదని, జల్లికట్టుపై నిషేధాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. దీనికి అమీ జాక్సన్ కూడా మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.

అయితే తమిళ సినిమా ద్వారా ఇండియన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టి, ఐ లాంటి తమిళ చిత్రాల ద్వారానే ఫేమస్ హీరోయిన్ అవ్వడంతో పాటు ఇపుడు రజనీకాంత్ రసనన భారీ తమిళ ప్రాజెక్టు రోబో-2లో నటిస్తున్న అమీ జాక్సన్ కూడా జల్లికట్టును వ్యతిరేకించడాన్ని కొందరు తమిళులు జీర్ణించుకోలేక పోతున్నారు. వెంటనే ఆమెకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. 'రోబో-2' నుంచి ఆమెను తొలగించాలని, లేకుంటే యూనిట్ పైన, హీరో రజనీ, దర్శకుడు శంకర్ పైనా దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారట!

English summary
Amy Jackson tweeted that people should sign the Peta petition against the tradition of 'Jallikattu' or bull-fighting in Tamil Nadu. Now a political outfit titled Tamilar Viduthalai Padai has decided to protest against her. Their leader, Veeralakshmi, has issued a statement to the media that they will protest against and seek her removal from the film with Rajinikanth.
Please Wait while comments are loading...