రామ్ చరణ్ హీరోయిన్ ఫిజిక్ పై విక్రమ్ కామెంట్
చెన్నై : "తను చాలా బావుంటుంది. ముఖ్యంగా ఆమెకు అందంతో పాటు మంచి ఫిజిక్ ఉంది. అందువల్లే ఆమె ఎంత గ్లామర్ గా కనిపించినా అసభ్యం అనిపించదు" అన్నారు విక్రమ్. ఆయన ఈ కామెంట్స్ చేసింది అమీ జాక్సన్ గురించి. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడులో నటిస్తోంది. తన సరసన శివ తాండవంలో చేసిన ఈమె గురించి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానా థా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకుంది. తెలుగులో కెరీర్ విషయానికి వస్తే...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఎవడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్ రచయితగా, చోటాకె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. తొలి సారిగా చెర్రీ, బన్నీ కలిసి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బన్నీ నటించే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటాయంటున్నారు. ఇక ఆమె అంతకు ముందు గౌతమ్ మీనన్ చిత్రం ఏమి మాయ చేసావే హిందీ రీమేక్ ఏక్ దీవానా ధా లో కూడా చేసింది. ఇప్పుడు శివ తాండవంపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది.
విజయ్ దర్సకత్వంలో రూపొందుతున్న శివ తాండవం చిత్రంలో విక్రమ్ విజువల్లీ ఛాలెంజెడ్ పాత్ర చేస్తున్నారు. విక్రమ్, జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్ దర్శ కత్వంలో సి. కళ్యాణ్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే రా ఏజెంట్ గానూ విక్రమ్ మరో పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











