టేక్ ల మీద టేక్ లు తినేస్తోందని గోల
'రోబో' అనంతరం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఐ'. విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. 'మదరాస పట్టిణం' ద్వారా తెరకు పరిచయమైన లండన్ భామ ఎమీజాక్సన్ హీరోయిన్. నిన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పాట, ప్రేమ సన్నివేశాలను తెరకెక్కించారు.
ప్రస్తుతం యాక్షన్, సెంటిమెంట్ భాగాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకు చిన్న డైలాగులు ఉండటంతో తమిళంలో ఏదోలా మాట్లాడి మేనేజ్ చేసింది ఎమీజాక్సన్. కానీ ప్రస్తుతం డైలాగులు పొడవుగా ఉండటంతో టేకుల సంఖ్య పెరుగుతోందట.
దీంతో రెండురోజుల ముందే అమ్ముడుకు స్క్రిప్టు ఇచ్చేసి హోంవర్క్ చేసుకురమ్మని చెబుతోంది చిత్రయూనిట్. షూటింగ్‌కు ముందే ఓ సారి సరిచూసుకుంటోంది.
ఈ విషయమై ఎమీ మాట్లాడుతూ.... '' తమిళంలో మాట్లాడటం ప్రస్తుతం సవాలుగా మారింది. శంకర్, కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సహాయంతో తమిళం నేర్చుకుంటున్నా. చిత్ర పరిశ్రమకు వచ్చాక ఇప్పుడే చాలా విషయాలను నేర్చుకున్నాను. 'ఐ' చిత్రంలో నటించడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఒకట్రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది'' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications












