రజనీ కాంత్ పై లారెన్స్ స్పెషల్ ఆల్బం

By Srikanya

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై నృత్యదర్శకుడు, దర్శకనటుడు రాఘవ లారెన్స్ ఓ ఆల్బం రూపొందించారు. దీన్ని రజనీ పుట్టినరోజు సందర్భంగా వచ్చేనెల 12న విడుదల చేయనున్నారు. ఆ ఆల్బంకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నాడు. రెబెల్ చిత్రం తర్వాత మీడియా ముందుకు లారెన్స్ వచ్చి మాట్లాడారు. రజనీ అభిమానులంతా ఆనందపడేలా ఆల్బమ్ రూపొందించానని చెప్తున్నాడు. అయితే రజనీ డేట్స్ పట్టడానికి,ఆయన దృష్టిలో పడటానికే లారెన్స్ ఈ ఆల్బం రూపొందించాడని కోలీవుడ్ లో వినపడుతోంది.

ఈ ఆల్బం గురించి లారెన్స్ మాట్లాడుతూ.. 'సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న కోట్ల అభిమానుల్లో నేనూ ఒకణ్ని. ఆయనపై నాకు అపార ప్రేమ, గౌరవమర్యాదలు ఉన్నాయి. నిజంగానే ఆయన అత్యద్భుత వ్యక్తి. రజనీసార్‌పై ఓ ఆల్బం రూపొందించా. దీనికి సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోనీ స్వరాలు సమకూర్చారు. ఈ ఏడాది సూపర్‌స్టార్‌ పుట్టినరోజు అపూర్వమైనదిగా భావిస్తున్నా. ఎందుకంటే అంతా పన్నెండులే వస్తున్నాయి. ఆరోజు రజనీ అభిమానులందరూ సంబరపడేలా ఈ ఆల్బంను విడుదల చేయనున్నా. నేను కూడా ఆ రోజు కోసం వేచిచూస్తున్నా. దీనిని రజనీకి ఆత్మీయ కానుకగా సమర్పించుకుంటున్నానని తెలిపారు.

రజనీకాంత్‌ నటించిన 'విక్రమసింహ'ను 12-12-12 అనే అరుదైన తేదీన తెరపైకి తీసుకురావాలనుకొన్నారు. తేదీలో అన్నీ పన్నెండులు ఉండటమే కాదు... ఆ రోజునే రజనీ జన్మదినం. ఈ సందర్భంగా 'విక్రమసింహ'ను విడుదల చేస్తే క్రేజ్‌ వస్తుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే ఆ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో వాయిదా వేశారు. అయితే రజనీ పుట్టిన రోజున ఆయన సినిమా ఒకటి విడుదలవుతోంది. అదేమిటంటే శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'శివాజి'.

2007లో వచ్చిన ఆ చిత్రానికి త్రీడీ హంగులు అద్దారు. ఇటీవలే ఆ సాంకేతిక కార్యక్రమాలు ముగిశాయి. చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎమ్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ ''రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న శివాజి త్రీడీని తెరపైకి తీసుకొస్తున్నాము''అన్నారు. ఇందులో శ్రియ కథానాయికగా నటించింది. త్రీడీకి అనుగుణంగా చిత్ర నిడివిని కొంత వరకూ తగ్గించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X