ఆ రూమర్స్ ఈ విలన్ పైనా,గోలెత్తిపోతున్నాడు
చెన్నై : ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. వారి ఆరోగ్యం బాగోలేదని, వారు చనిపోయారని ఇలా వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా ఆ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సెలబ్రెటీలు వెంటనే స్పందించి తమ గురించి ప్రకటించాల్సిన పరిస్దితి వస్తోంది. లేకపోతే వారి అభిమానులు బాధపడతారు. తాజాగా అలాంటి పరిస్దితిని తమిళ, తెలుగు చిత్రాల్లో విలన్ గా చేసిన ఆనంద్ రాజ్ ఎదుర్కొంటున్నారు.
తాను ఆరోగ్యంగా, సంతోషంగానే ఉన్నానని తనకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మొద్దని చెబుతున్నారు నటుడు ఆనంద్‌రాజ్. గుణచిత్ర పాత్రల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించారు ఆనంద్‌రాజ్. శుక్రవారం నుంచి ఆయనకు సంబంధించి పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి.

తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వాట్సాప్‌లో సందేశాలు చక్కర్లు కొట్టాయి. కానీ ప్రస్తుతం ‘వల్లవనుక్కు వల్లవన్' చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆనంద్‌రాజ్ ఈ సందర్భంగా ముచ్చటించారు.
ప్రస్తుతం తన కెరీర్ సజావుగా సాగుతోందని, పలు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. అయితే ఇటీవల వచ్చిన వార్తలన్నీ సత్యదూరమని పేర్కొన్నారు. ఈ సందేశాలతో తన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆవేదనకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం బాబిసింహా హీరోగా నిర్మితమవుతున్న ‘వల్లవనుక్కు వల్లవన్' సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.


Click it and Unblock the Notifications











