ప్రముఖ విలన్‌ సోదరుడి ఆత్మహత్య.. సూసైడ్ వెనుక భయంకరమైన వాస్తవాలు

తన సోదరుడు ఆత్మహత్య చేసుకోవడంపై ప్రముఖ విలన్ ఆనంద్ రాజ్ స్పందించారు. కొద్ది రోజుల క్రితం పాండిచ్చేరిలో ఆనంద్ రాజ్ సోదరుడు కనగసబాయ్ సూసైడ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడం తమిళ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ విషాద ఘటనతో ఆనంద్ రాజ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఇంతకు ఆనంద్ రాజ్ సోదరుడు మరణం వెనుక అసలు విషయం ఏమిటంటే..

 చిట్‌ఫండ్ బిజినెస్ కారణంగా

చిట్‌ఫండ్ బిజినెస్ కారణంగా

ఆనంద్ రాజ్ సోదరుడు కనగసబాయ్ పాండిచ్చేరి, తమిళనాడులో చిట్ ఫండ్ బిజినెస్‌ను నిర్వహిస్తుంటాడు. అన్నయ్యకు చోదుడుగా వాదోడుగా ఉంటూనే తన వ్యాపారంలో బిజీగా ఉంటారు. అయితే చిట్ ఫండ్ వ్యాపారంలో నష్టాలు రావడమే కనగస‌బాయ్ మరణానికి కారణమని ఆరోపణలు వచ్చాయి.

విషాదం నుంచి ఆనంద్ రాజ్..

విషాదం నుంచి ఆనంద్ రాజ్..

ఆనంద్ రాజ్ తన సోదరుడి మరణ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఈ సందర్భంగా తన సోదరుడి మరణంపై అనేక రూమర్లు రావడంతో వాస్తవాలు చెప్పేందుకు మీడియాతో మాట్లాడారు. తన సోదరుడి మరణానికి చిట్ ఫండ్ వ్యాపారంలో నష్టాలు కావు అని చెప్పారు.

 నా సోదరుడి మరణానికి నష్టాలు కాదు..

నా సోదరుడి మరణానికి నష్టాలు కాదు..

నా సోదరుడు కనగబాయ్ సూసైడ్ కారణం బెదిరింపులే. కొందరు అతడిని చంపుతామని బెదిరించారు. దాంతో కొద్దిరోజులుగా మానసిక క్షోభకు గురైన నా సోదరుడు తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నాడు. ఆయన మరణం మా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది అని ఆనంద్ రాజ్ వెల్లడించారు.

Recommended Video

Young Comedy Actor Admitted To ICU | Filmibeat Telugu
చంపుతామని బెదిరింపులు.. అందుకే

చంపుతామని బెదిరింపులు.. అందుకే

నా సోదరుడు కనగసబాయ్ ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ విషయంలో నా సోదరుడిని వేధించడం మొదలుపెట్టారు. ఓ దశలో దాడికి కూడా ప్రయత్నించారు. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యపై ఏడీఎంకే అధికార ప్రతినిధి విచారణ జరపాలని పోలీసులను కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X