Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
యాంకర్ రిక్వస్ట్ చేసినా వెళ్లిపోయిన స్టార్ హీరో.. తప్పు తెలుసుకుని, పెళ్ళిలో సామాన్యుడిలా!
ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతమ్ అట్లీ దర్శత్వంలో ఫుట్ బాల్ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. వరుస విజయాలతో విజయ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అభిమానుల్లో తనకు అంత క్రేజ్ ఉన్నా విజయ్ మాత్రం సింపుల్ గా ఉంటాడు. తమిళ యాంకర్ వీజే అంజనా ఓ సందర్భంలో విజయ్ తో జరిగిన సంఘటన గురించి చెప్పింది. విజయ్ మంచితననానికి ఇదే నిదర్శనమని అంటోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం!
ఆడియో వేడుకలో
విజయ్ హీరోగా నటించిన ఫాంటసీ చిత్రం పులి 2015లో విడుదలైంది. ఆ చిత్ర ఆడియో వేడుకలో చోటు చేసున్న ఓ సంఘటనని అంజనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. పులి చిత్ర ఆడియో వేడుకలో హాజరైన అతిథులకు విజయ్ చేతుల మీదుగా మొమెంటోలు అందించాలి. ఈవెంట్ నిర్వాహకులు ఈ విషయాన్ని ముందుగా విజయ్ కి చెప్పామన్నారు. విజయ్ సర్ వద్దకు నేను వెళ్లి చెప్పా. కానీ ఆయన వినిపించుకోలేదు.
బిజీగా ఉన్నాడు
అక్కడ ఉన్న కొంతమంది అతిథులతో మాట్లాడుతూ విజయ్ సర్ బిజీగా గడుపుతున్నారు. అందుకే నేను చెప్పించి సరిగా వినిపించుకోలేదు. ఆ తర్వాత అతిథులకు మొమెంటోలు అందించకుండానే వెళ్లిపోయారు. యాంకర్ గా ఉన్న నాకు ఈ సంఘటన ఇబ్బందిగా అనిపించింది. కానీ విజయ్ సర్ తన తప్పు తెలుసుకుని స్పందించిన తీరు తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాలసిందే. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి. స్వయంగా విజయ్ సర్ ఫోన్ చేసి క్షమాపణ కోరారు. బిజీగా ఉంది మరచిపోయానని అన్నారు.
పొరపాట్లు సహజమే
ఇలాంటి ఈవెంట్స్ లో చిన్న చిన్న పొరపాట్లు సహజమే. కానీ తమ తప్పు తెలుసుకుని క్షమాపణ కోరే విజయ్ సర్ లాంటివాళ్లు చాలా తక్కువగాఉంటారని అంజన పేర్కొంది. ఆ తర్వాత నేను విజయ్ సర్ ని నా పెళ్ళికి ఆహ్వానించా. మా పెళ్లి వేడుకకు హనరైన అయన సామాన్యుడిలా అందరిలో కలసిపోయారు అంటూ అంజనా విజయ్ పై ప్రశంసలు కురిపించింది.
హిట్ కాంబినేషన్
విజయ్, అట్లీలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. క్రీడల్లో జరిగే రాజకీయాలు, ప్రతిభావంతులకు జరిగే అన్యాయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్, తేరి చిత్రాలు ఘనవిజయం సాధించాయి.