ఆ దర్శకుడితో అఫైర్ దారుణం.. నాపై పైశాచికంగా.. ఆండ్రియా జెర్మియా
అందాల భామ ఆండ్రియా జెర్మియా తమిళ, తెలుగు ప్రేక్షకులందరికీ తన అభినయం, అందంతో సుపరిచితులు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్లకైనా సిద్దంగా ఉంటారు. అంతేకాకుండా ఎలాంటి మొహమాటం లేకుండా మీడియాతో తన అనుభవాలను పంచుకొంటారు. అలాంటి ఆండ్రియా తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి క్లియర్‌గా చెప్పారు. వివరాల్లోకి వెళితే..

ఆ దర్శకుడితో పరిచయం
తమిళంలో దర్శకుడు సెల్వరాఘవన్ రూపొందించిన ఆయైరాతిల్ ఓరువన్ చిత్రంలో ఆండ్రియా జెర్మియా నటించింది. ఆ సందర్భంగా సెల్వరాఘవన్‌తో పెరిగిన పరిచయం మరో లెవెల్‌కు చేరుకోవడం జరిగింది. అయితే వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు అనేక వివాదాలకు కారణమయ్యాయి.

సెల్వ, ఆండ్రియా రిలేషన్‌పై
ఆయైరాతిల్ ఓరువన్ సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆండ్రియా, సెల్వరాఘవన్ రిలేషన్‌పై ఎన్నో రూమర్లు, గాసిప్స్ వచ్చాయి. కానీ వారిద్దరు తమ మధ్య రిలేషన్ ఏమీ లేదంటూ ఖండించారు. అయితే చివరికి ఓ మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆండ్రియా సమాధానం ఇస్తూ.. సెల్వరాఘవన్‌తో స్పెషల్ రిలేషన్‌షిప్ ఉంది అని అంగీకరించింది.

భార్యతో సెల్వ విడాకులు
ఆ తర్వాత జెర్మియా వ్యాఖ్యలు సెల్వరాఘవన్ జీవితంలో ఓ కుదుపుకు కారణమైంది. ఆండ్రియా రిలేషన్‌షిప్ కారణంగా సెల్వరాఘవన్, ఆయన భార్య నటి సోనియా అగర్వాల్ మధ్య చిచ్చు పెట్టింది. ఈ కారణమే సెల్వ, సోనియా విడాకులకు కారణమని సినీ వర్గాలు చెప్పుకొంటారు.

ఆండ్రియా, సెల్వ బ్రేకప్
సోనియాతో విడాకుల తర్వాత సెల్వరాఘవన్, ఆండ్రియా మధ్య రిలేషన్‌షిప్ కొంత కాలం సాగింది. అయితే వారిద్దరి అఫైర్ ఎక్కువకాలం కొనసాగలేదు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. అనంతరం గీతాంజలి అనే బంధువుల అమ్మాయిని సెల్వ రాఘవన్ పెళ్లి చేసుకొన్నారు.

వివాహితుడితో రిలేషన్ కారణంగా
అనంతరం ఆండ్రియా ఓ ఇంటర్యూలో ఆండ్రియా మాట్లాడుతూ.. ఓ వివాహితుడితో పెట్టుకొన్న సంబంధం చేదు అనుభవం మిగిల్చింది. ఆ కాలమంతా చాలా భాధకరమైనది. నన్ను శారీరకంగా, మానసికంగా వేధించాడు. దాంతో నేను మానసిక క్షోభకు గురయ్యాను. దానిని నుంచి బయటపటడటానికి నేను ట్రీట్‌మెంట్ కూడా పొందాను అని పేర్కొన్నారు.
Recommended Video

ఆండ్రియా కెరీర్ ఇలా...
ఆండ్రియా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు, ఈ చిత్రంలో మాళవిక మోహన్, విజయ్ సేతుపతి నటించారు. ఈ చిత్రం కరోనావైరస్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











