For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్‌కి కరోనా, క్వారెంటైన్‌లో ఉండి కూడా బుగ్గలు నాకించుకుంటూ.. ఇదేం పిచ్చి!

  |

  కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా ఈ కరోనా ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే సినీ పరిశ్రమలో పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. తమిళ హీరోయిన్, ప్లేబ్యాక్ సింగర్ ఆండ్రియా జెరెమియాకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకి గత వారం కరోనా సోకిందన్న ఆమె ఇప్పుడు క్వారంటైన్ లోనే ఉన్నానని కోలుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆమె చేసిన ఒక పని మాత్రం కొందరికి కోపం తెప్పిస్తోంది. ఇంతకీ ఆమె ఏమి చేసిందనే వివరాల్లోకి వెళితే

  మూతి ముద్దుల ఫోటోలతో

  మూతి ముద్దుల ఫోటోలతో

  ఆండ్రియా అనే పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఒక్కసారి యుగానికి ఒక్కడు గుర్తు చేసుకుంటే అందులో ప్రొఫెసర్ కూతురుగా నటించిన ఈ భామ ఆ తర్వాత తెలుగులో సునీల్ తో తడాఖా సినిమాలో జోడీ కట్టింది. తమిళనాట ఆమెకు మంచి క్రేజ్ ఉంది. పైగా ఆ మధ్య అనిరుధ్ తో ప్రేమాయణం నడిపి మూతి ముద్దుల ఫోటోలు కూడా బయటకు రావడంతో బాగా పాపులర్ అయింది ఆండ్రియా.

  హాట్ నెస్ కి కేరాఫ్

  హాట్ నెస్ కి కేరాఫ్


  ఆ మధ్య గృహం సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి మంచి హాట్ షో కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో మూతి ముద్దులతో పాటు బెడ్ రూమ్ సీన్స్ లో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది ఆమె. ఆ తరువాత ఇప్పుడు విశ్వరూపం 2 సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక తాజాగా ఇలయదళపతి విజయ్ ‘మాస్టర్' చిత్రంలోనూ అలరించారు. నటిగానే కాదు.. గాయనిగా కూడా ఆండ్రియాకి మంచి గుర్తింపు ఉంది.

  అనిరుద్ తో లిప్ లాకులు

  అనిరుద్ తో లిప్ లాకులు


  అప్పట్లో తమిళ మ్యూజిక్ సంచలనం అనిరుధ్‌తో ఆండ్రియా లిప్ లాక్ చేస్తూ రొమాన్స్‌లో తేలియాడుతున్న ఫొటోలు సూచీ లీక్స్ పుణ్యమా అని వైరల్ కాగా అప్పుడు ఏమీ మాట్లాడని ఆమె చాలా ఏళ్ల తర్వాత ఓపెన్ అయింది. అనిరుధ్ రొమాన్స్ చేస్తూ ముద్దులు పెట్టుకున్న మాట వాస్తవమే అని అప్పుడు అనిరుధ్‌లో రిలేషన్‌లో ఉన్నానని అలాంటప్పుడు ముద్దు పెట్టుకోవడంలో తప్పేం ఉందని ఎదురు ప్రశ్నించింది ఈ ముద్దుగుమ్మ. అయితే తమ పర్సనల్ ఫొటోలు లీక్ కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని.. దానిపై అనిరుధ్ తనకు క్షమాపణ చెప్పాడని కూడా చెప్పింది.

  పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్

  పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్


  ఇక ‘బ్రోకెన్‌ వింగ్‌' అనే పుస్తకాన్ని కూడా రాసిన ఆమె అందులో ప్రేమపై తన అభిప్రాయాలు వివరించారు, తన బాధను వ్యక్తం చేశారు. ‘పెళ్లయిన వ్యక్తిని ప్రేమించానని, అతను నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఆ బాధ భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తిరిగి కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స తీసుకుని బాధలోనే ‘బ్రోకెన్‌ వింగ్‌‌' పుస్తకాన్ని రాశానని అప్పట్లో ఆమె చెప్పుకొచ్చింది.

  Krithi Shetty, Vaishav Tej's Uppena Records Highest TRP || Filmibeat Telugu

  బుగ్గలు నాకించుకుంటూ


  ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ భామ కరోనా సోకింది కాబట్టి ఇంట్లో ఉంది. కానీ తన బుగ్గలు కుక్కపిల్లతో నాకించుకుంటూ, దానితో ముద్దులాడుతూ ఫోటోలు, వీడియోలు పెట్టింది. అసలే జంతువులకు కూడా కరోనా వస్తుందని అందరూ టెన్షన్ పడుతుంటే కరోనా సోకినప్పుడు కూడా వాటితో అలా క్లోజ్ గా ఉండడం ఏంటి ? ఏమన్నా పిచ్చా ? అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆమెను కామెంట్స్ తో ఆడుకుంటున్నారు. నిజమే మరి ఈ మాయదారి రోగం ఎటు పోయి ఎటు వస్తుందో చెప్పలేక పోతున్నాం. ఇలాంటి సమయంలో అలాంటి రిస్కులు అవసరమా?

  English summary
  Andrea Jeremiah tested positive for COVID-19 last week. She has got a cute quarantine partner and it is no other but her pet. she shared a couple of videos of herself being pampered by her adorable puppy
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X