సిల్క్‌స్మిత యానిమేషన్ చిత్రం..డిటేల్స్
1980, 90 దశాబ్దాల్లో యువతనే గాకుండా పెద్దల హృదయాలను కొల్లగొట్టిన నటి సిల్క్ స్మిత. తన అందచందాలతోను, అభినయంతోనుప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆమె చనిపోయాక కూడా డర్టి పిక్చర్ వంటి చిత్రాలతో ఆమెను మరో సారి గుర్తు చేసుకున్నారు. విద్యాబాలన్ నటించిన 'ది డర్టీ పిక్చర్' 114 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షాక్ అయ్యేలా చేసింది.
సిల్స్ స్మిత జీవతం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తరహాలో మరో చిత్రం కన్నడంలో రూపొందుతోంది. పాకిస్దాన్ శృంగార నటి వీణా మాలిక్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా పేరు 'డర్టీ పిక్చర్.. సిల్క్ సకత్‌హాట్‌మగ'. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం 'ది డర్టీ పిక్చర్' నకలు అని ప్రచారం జరుగుతోంది. అయితే వీణా మాలిక్ దీన్ని కొట్టిపారేస్తోంది.
ఈ విషయమై వీణా మాలిక్ మాట్లాడుతూ... హిందీ 'ది డర్టీ పిక్చర్' కీ మా చిత్రానికి పోలీక లేదు. మేము సిల్క్ స్మిత జీవితం రీసెర్చ్ చేసిన స్క్రిప్టుపై పనిచేస్తున్నాం. నేను ఆ సినిమాని చూసాను. మా స్క్రిప్టుని చదివాను. ఎక్కడా అస్సలు పొంతన లేదు. అయితే సిల్క్ స్మిత పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను. దర్శక,రచయితలు ఈ పాత్ర నిమిత్తమై చాలా రీసెర్చ్ చేసారు. గ్యారెంటీగా మా చిత్రం సిల్క్ అభిమానులును ఆకట్టుకుంటుంది అంది.


Click it and Unblock the Notifications












