twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిల్క్‌స్మిత యానిమేషన్ చిత్రం..డిటేల్స్

    By Srikanya
    |

    చెన్నై: త్వరలో దివంగత నటి సిల్మ్ స్మిత యానిమేషన్ లో కనిపించి అలరించనుంది. తమిళ దర్శకుడు యువరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కలియుగం' చిత్రంలో సిల్క్‌స్మిత యానిమేషన్ సన్నివేశాలు చోటుచేసుకోనున్నాయి. 'కలియుగం' చిత్రంలో 40 ఏళ్ల వ్యక్తి తన గత జీవితాన్ని నెమరువేసుకుంటున్నట్లు, అందులో సిల్క్‌స్మిత రంగప్రవేశం చేసినట్లు సన్నివేశం రూపొందించబడుతోంది. సిల్క్ మృతిచెంది అనేక సంవత్సరాలు అవుతున్నప్పటికీ తమిళ చిత్ర రంగం, అభిమానులు ఆమెను తమ హృదయాల్లో సుస్థిరంగా ప్రతిష్టించుకున్నారని చెప్పటమే ఈ సీన్ల ఉద్దేశ్యమని అంటున్నారు.

    1980, 90 దశాబ్దాల్లో యువతనే గాకుండా పెద్దల హృదయాలను కొల్లగొట్టిన నటి సిల్క్ స్మిత. తన అందచందాలతోను, అభినయంతోనుప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆమె చనిపోయాక కూడా డర్టి పిక్చర్ వంటి చిత్రాలతో ఆమెను మరో సారి గుర్తు చేసుకున్నారు. విద్యాబాలన్ నటించిన 'ది డర్టీ పిక్చర్' 114 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షాక్ అయ్యేలా చేసింది.

    సిల్స్ స్మిత జీవతం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తరహాలో మరో చిత్రం కన్నడంలో రూపొందుతోంది. పాకిస్దాన్ శృంగార నటి వీణా మాలిక్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా పేరు 'డర్టీ పిక్చర్‌.. సిల్క్‌ సకత్‌హాట్‌మగ'. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం 'ది డర్టీ పిక్చర్' నకలు అని ప్రచారం జరుగుతోంది. అయితే వీణా మాలిక్ దీన్ని కొట్టిపారేస్తోంది.

    ఈ విషయమై వీణా మాలిక్ మాట్లాడుతూ... హిందీ 'ది డర్టీ పిక్చర్' కీ మా చిత్రానికి పోలీక లేదు. మేము సిల్క్ స్మిత జీవితం రీసెర్చ్ చేసిన స్క్రిప్టుపై పనిచేస్తున్నాం. నేను ఆ సినిమాని చూసాను. మా స్క్రిప్టుని చదివాను. ఎక్కడా అస్సలు పొంతన లేదు. అయితే సిల్క్ స్మిత పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను. దర్శక,రచయితలు ఈ పాత్ర నిమిత్తమై చాలా రీసెర్చ్ చేసారు. గ్యారెంటీగా మా చిత్రం సిల్క్ అభిమానులును ఆకట్టుకుంటుంది అంది.

    English summary
    Director Yuvaraj is going to make animation movie in Tamil on late actress Silk Smitha’s life by title ‘Kaliyuga’. The director will show various incidents of Silk Smitha’s life and her entry into the movies. The hot actress who captured the hearts of young and old is still unforgettable, the people in Tamil Nadu still remember the actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X