చైనీస్ పోర్న్ వీడియోలో ఉన్నది నేనే అంటున్నారు.. పిచ్చెక్కిపోయింది, ఎంత దారుణం!
హీరో ధనుష్ నటించిన 'వై దిస్ కొలవెరి' అనే ఒక్క సాంగ్ తో యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయాడు. అప్పటి నుంచి అనిరుద్ సంగీత దర్శకుడిగా అవకాశాలు పెరిగాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. 2017లో జరిగిన సుచిలీక్స్ సంఘటన అన్ని చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో అనిరుధ్ పేరు కూడా లీక్ అయింది. ఆ సంఘటన గురించి అనిరుధ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

సుచిలీక్స్
సింగర్ సుచిత్ర సోషల్ మీడియా అకౌంట్ నుంచి 2017లో లీక్ అయిన వీడియోలో, ఫోటోలు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. కొందరు హీరోయిన్ల పేరుతో న్యూడ్ ఫోటోలు వీడియోలో లీక్ అయ్యాయి. చాలా మంది హీరోయిన్లు, సినీ ప్రముఖులు లీక్ అయిన దృశ్యాల గురించి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుచిలీక్స్ పేరుతో పెద్ద దుమారమే చెలరేగింది.

అనిరుధ్ పేరు కూడా
ఈ ఘటనలో అనిరుద్ కూడా చిక్కుకున్నాడు. అనిరుద్ కి సంబంధించిన వీడియో అంటూ ఓ పోర్న్ వీడియోలో నెట్టింట హల్ చల్ చేసింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి అనిరుద్ లాగే ఉన్నదంటూ కూడా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అనిరుధ్ ఆ సంఘటన గురించి మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చాడు. అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తికీ నాకు పోలికలు కూడా లేవని తెలిపాడు.

చైనీస్ వీడియో
ఈ సంఘటన జరిగినప్పుడు నేను విదేశాల్లో ఉన్నా. నా స్నేహితులు ఫోన్ చేసి నీ పేరుతో ఓ పోర్న్ వీడియో వైరల్ అవుతోందని చెప్పారు. నాకు పిచ్చెక్కిపోయినంత పని అయింది అని అనిరుధ్ తెలిపాడు. వెంటనే ఆ వీడియో చూశాను. ఆ వీడియోలో ఉన్న వ్యక్తికీ నాకు చిన్న పోలిక కూడా లేదు. కానీ నేనే అంటూ అసత్య ప్రచారం చేసారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఎంత దారుణం అని అనిరుధ్ అన్నాడు. ఆ వీడియో గురించి ఆరా తీస్తే అది ఒక చైనీస్ పోర్న్ వీడియో అని తేలినట్లు అనిరుధ్ వివరణ ఇచ్చాడు.

క్రేజీ చిత్రాలతో
ప్రస్తుతం అనిరుధ్ క్రేజీ చిత్రాలకు సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. తెలుగులో నాని నటిస్తున్న జెర్సీ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడు. ఇది అతడికి అజ్ఞాతవాసి తర్వాత తెలుగులో రెండవ చిత్రం. ఇక ప్రతిష్టాత్మకమైన కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2కి కూడా అనిరుద్దే సంగీత దర్సకుడు.


Click it and Unblock the Notifications











