ఆ హీరోయినే నా ఫస్ట్ లవ్.. అందుకే విడిపోయాం.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంచలన వ్యాఖ్యలు!

కోలీవుడ్ లో సంగీత సంచలనంగా వెలుగు వెలుగుతున్నాడు అనిరుధ్ రవిచందర్, రెహమాన్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనిరుధ్‌.. చాలా తక్కువ టైమ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అంతే కాదు చాలా చిన్నవయస్సులో ఈ ఘనత సాధించిన రికార్డ్ కూడా అనిరుధ్ సొంతం. హీరో ధనుష్ అనిరుధ్ ను తన సినిమాల ద్వారా పరిచయం చేయగా.. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు కుర్ర సంగీత దర్శకుడు.

కోలీవుడ్‌లో విజయ్, అజిత్, రజనీ లాంటి టాప్ స్టార్లకు సూపర్ హిట్ సినిమాలకు.. అద్భుతమైన సంగీతం అందించిన అనిరుధ్.. ఇటు తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాలకు పనిచేశాడు. తెలుగు, తమిళంతో పాటు.. హిందీ వంటి పలు భాషల్లో కూడా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అనిరుధ్ కమల్ హాసన్, రజినీకాంత్, అజిత్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, లాంటి స్టార్ల సినిమాలకు పనిచేస్తున్నాడు.

Anirudh Ravichander comments about his First love with Singer andrea jeremiah

ఇంత స్టార్ గా మారిన అనిరుధ్ కెరీర్ లో కాంట్రవర్సీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు రాక్‌స్టార్‌గా మారిన అనిరుధ్ గతంలో కొంతకాలం పాటు వివాదాల్లో ఇరుక్కున్నాడు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ ఆండ్రియాతో ప్రేమ వ్యవహారం కూడా ఆయనకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో... సుచీ లీక్స్ ద్వారా వీరిద్దరూ క్లోజ్ లిప్‌లాక్ కిస్‌ను పంచుకున్న ఫోటోలు లీక్ అయి కోలీవుడ్‌లో సంచలనం సృష్టించాయి.

ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. కాని అప్పుడు ఆ వివాదం అనిరుధ్ ను వెంటాడుతూనే ఉంది. ఇక తాజాగా అనిరుధ్ ఈ విషయంలో స్పందించారు. తమ ప్రేమ ఎందుకు విఫలమైంది..తాము ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నాము అనే విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు.

ఇంటర్వ్యూలో భాగంగా.. మీరు ప్రేమించిన నటి ఎవరు, ఆమె పేరు, మీ లవ్ ఫెయిల్యూర్ కు కారణం ఏంటీ అనేది ఎప్పుడూ చెప్పలేదంటూ ప్రశ్న ఎదురయ్యింది. దాంతో తన ప్రియురాలి పేరు ఆండ్రియా అని అనిరుధ్ బదులిచ్చారు. నేను 19 సంవత్సరాల వయస్సులో ప్రేమలో పడ్డాను. నా మొదటి ప్రేమ కూడా ఆమెనే. అప్పుడు ఆండ్రియా వయసు 25 ఏళ్లు అంటూ షాక్ ఇచ్చారు.

Anirudh Ravichander comments about his First love with Singer andrea jeremiah

నా ప్రేమ విఫలం కావడానికి ప్రధాన కారణం మా ఇద్దరి మధ్య వయసు తేడా. ఆండ్రియా నాకంటే 6 ఏళ్లు పెద్దది అదే మా ప్రేమకు శాపంగామారింది. కాబట్టి మేమిద్దరం విడిపోయాము. అని అనిరుధ్ వ్యాఖ్యానించినట్టుగా తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రజినీకాంత్ జైలర్ సినిమాతో సంచలనంగా మారాడు అనిరుధ్.. ఈసినిమాకు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. దాంతో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస అవకావాలు అనిరుధ్ ను వరిస్తున్నాయి. యువ సంగీత సంచలనంగా మారాడు అనిరుధ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X