యువ హీరోతో రిలేషన్‌షిప్.. ఇలాంటి రూమర్స్‌తో ఏడుస్తున్నా, సడెన్‌గా మాట మార్చేసిందిగా!

హీరోయిన్ అంజలికి జర్నీ చిత్రం మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. జర్నీ చిత్రం తర్వాత అంజలి తెలుగు తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మరోసారి అంజలి సత్తా చాటింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో కూడా అంజలి మెరిసింది. ప్రస్తుతం అంజలి తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

యువ హీరోతో ఎఫైర్

యువ హీరోతో ఎఫైర్

యువ హీరో జై, అంజలి జర్నీ చిత్రంలో జంటగా నటించారు. వీరి మధ్య కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలాన్నిచ్చేలా అంజలి, జై ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పలు సందర్భాల్లో కనిపించారు. ఏకంగా హీరో జై, అంజలి ఒకే ఫ్లాట్ లో ఉంటూ ఇద్దరూ కలసి దోసెలు వేసుకుంటున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 పెళ్లి చేసుకోబోతున్నట్లు

పెళ్లి చేసుకోబోతున్నట్లు

దీనితో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో అంతా నిర్ధారణకు వచ్చేశారు. త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరి కొకరు బర్త్ డే విషెష్ చెప్పుకోవడం, పరస్పర అభినందనలతో వ్యవహారం బాగానే సాగింది. కానీ కొంత కాలంగా ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంజలికి జైతో ఎఫైర్ గురించి ప్రశ్న ఎదురైంది. అంజలి ఊహించని సమాధానం ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

ఇలాంటి రూమర్స్ వింటే

ఇలాంటి రూమర్స్ వింటే

తానెప్పుడూ జైతో డేటింగ్ చేస్తున్నట్లు మీడియాకు చెప్పలేదని అంజలి తెలిపింది. ఈ రూమర్స్ ఎలా పుట్టుకొచ్చాయో తెలియదని, కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని అంతా మరచిపోతారని అంజలి తెలిపింది. తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఇలాంటి రూమర్స్ వింటే గతంలో భాదపడేదాన్ని, ఏడ్చేదాన్ని అని అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కానీ ఇప్పుడు తనకు రూమర్స్ ఆ;అవాటైపోయినట్లు చెప్పుకొచ్చింది. జైతో జోరుగా ప్రేమ వ్యవహారం సాగించిన అంజలి సడెన్ గా మాట మార్చేయడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జైతో విడిపోయిన తర్వాతే అతడి గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తోందని అంటున్నారు.

లేటెస్ట్ హిట్

లేటెస్ట్ హిట్

మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన పెరంబు చిత్రం ఇటీవల తమిళనాడులో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అంజలి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. రామ్ దర్శత్వం వహించిన ఈ చిత్రానికి అటు ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X