For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జర్నలిస్ట్ పాత్రలో 'సీతమ్మవాకిట్లో....'అంజలి

  By Srikanya
  |
  చెన్నై : మహేష్ 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో సీత గా కనిపించిన అంజలిని ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం వైవిధ్యపాత్రలో దర్శనమివ్వనుంది. ఆర్య కథానాయకుడిగా వస్తున్న 'సేటె'లో హన్సికతో పాటు తెరను పంచుకుంటోంది. ఇందులో అంజలి పాత్రికేయురాలిగా కనిపించనుంది. సహజసిద్ధంగా హావభావాలు పండించేందుకు పాత్రికేయుల విధుల్ని క్షుణ్ణంగా పరిశీలించిందట. ముఖ్యంగా తనకు బాగా పరిచయమున్న కొందరు పాత్రికేయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతోందట. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రంలో రిపోర్టర్ గా కనిపించటానికి రెడీ అవుతోంది.

  'అంగాడితెరు'లో అందరినీ ఆకట్టుకున్న అంజలి అనంతరం సవాలైన పాత్రల్లో మెప్పించింది. తెలుగులో ఇటీవల వచ్చిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ముఖ్యభూమిక పోషించింది. గతవారం విడుదలైన 'వత్తికుచ్చి'లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... మోడలింగ్‌ రంగం నుంచి నేరుగా ఎనిమిదేళ్ల క్రితం తెలుగులో 'ఫొటో', 'ప్రేమలేఖరాశా' సినిమాల్లో నటించా. అదీ ఒకింత అదృష్టమనే చెప్పాలి. మళ్లీ తమిళనాట ప్రయత్నించా. సఫలమయ్యా. మళయాళంలో కూడా గుర్తింపు వచ్చింది. 'అంగాడితెరు' తమిళ సినిమాకు తెలుగు ప్రతి 'షాపింగ్‌మాల్‌' చూసిన తరువాత బంధువులు, స్నేహితులు ఫోన్లో పలకరించడం మరచిపోలేను. ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి పాత్రలు చేస్తున్నా అంది.

  ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గురించి చెప్తూ.... ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపిస్తుంది. జీవితంలోని అరుదైన సంఘటనలన్నీ మదిలో ఒక్కసారిగా మెదులుతాయి. దర్శకుడు శ్రీకాంత్‌ చూపిన మంచితనం రాజ్యమేలే తీరు.. అనుబంధాల పండించిన వైనం నన్ను మరీ ఆకట్టుకుంది. నాకైతే సినిమా చిత్రీకరణ సమయంలోనే బంధువులంతా గుర్తుచ్చేవారు. ఇక సినిమా అంటారా! తొలిసారిగా తెలుగులో ప్రముఖ నటీనటుల మధ్య నటించాను. వెంకటేష్‌, మహేష్‌, జయసుధ, ప్రకాష్‌రాజ్‌లతో కలిసి నటించడం.. అదీనూ సంక్రాంతి పండుగలో కుటుంబ ఆప్యాయతలను చాటిచెప్పే ఈ చిత్రం విడుదల కావడం ఇంకా అదృష్టంగానూ భావిస్తున్నాను అంది.

  తన నిజజీవితానికి సీతమ్మ పాత్రకూ సంభందం గురించి చెపుతూ... నిత్యం నేను ఎలా మాట్లాడుతానో.. అలాగే సినిమాల్లో కూడా డబ్బింగ్‌ చెబుతాను.. వేరేగా నొక్కి చెప్పను. నిజ జీవితంలో అంజలి తనలాగానే ఉంటుంది. కానీ కళామతల్లి సేవలో వచ్చిన అవకాశాలను నిజ జీవితంలో కూడా ఇలా ఉంటారా! అనే రీతిలో పండించాలన్నదే నా ధ్యేయం. ఎలాంటి పాత్ర వచ్చినా దానికి న్యాయం చేశానా లేదా అని మాత్రం ఆలోచించుకుంటాను. అందుకే నా నటన సహజత్వంతో కూడి ఉంటుంది. ఆ కోణంలోనే డీ-గ్లామరైజ్డ్‌ పాత్ర అయినప్పటికీ షాపింగ్‌మాళ్‌లో నటించా. తమిళ ప్రతిలో 2011లో ఉత్తమ నటి అవార్డు కూడా పొందాను. జర్నీలో మధుమతి ధైర్యం.. సీతమ్మ వాకిట్లో.. సంప్రదాయ తీరుతోనే ఇంట్లో కూడా ఉంటాను అంది.

  English summary
  Anjali has a slew of films lined up, gearing for release and one of them will feature her in a never seen before avatar. In Settai, the Delhi Belly remake, Anjali plays the role of a journalist named Shakti and a total overhaul in make-up and costume was required to suit her character which is that of an ultra-modern girl. Anjali says she had been taking cues from leading female journalists to prepare for the role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X