దోసె పెనంతో డైరెక్టర్ ముఖం పగులగొట్టిన అంజలి, తీవ్ర గాయం.. అసలేం జరిగిందంటే!
తెలుగు అమ్మాయి అంజలి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జర్నీ వంటి చిత్రాలతో అంజలి నటిగా వందకు వంద మార్కులు కొట్టేసింది. తాజగా అంజలి లీసా అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన ఘటనతో అంజలి తెగ ఫీల్ అయిపోతోందట.
అంజలి వలన చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్ ప్రమాదానికి గురయ్యాడు. హర్రర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ సమయంలో అంజలి దర్శకుడిని గాయపరిచింది. దోసె పెనంని కెమెరా వైపుగా అంజలి విసిరి కొట్టాలి. ఆ సన్నివేశాని షూట్ చేస్తున్నారు.

కానీ అంజలి పొరపాటుగా దర్శకుడిపైకి పెనం విసిరిందట. దీనితో దర్శకుడు ముఖానికి పెనం తగలడంతో కంటి పైభాగంలో గాయం అయింది. దర్శకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయానికి కుట్లు వేసి చికిత్స అందించారు. తన వలన ప్రమాదం జరగడంతో అంజలి భాదపడుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











