అంజలి భయంకర రూపం.. షాకిస్తున్న ఫస్ట్ లుక్!
కెరీర్ ఆరంభంలో హోమ్లీ బ్యూటీగా అదరగొట్టిన అంజలి ఇప్పుడు విభిన్న చిత్రాలు, విభిన్న పాత్రలపై ఆసక్తి చూపుతోంది. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాల్లో అంజలి హోమ్లీ బ్యూటీగా తెలుగు అలరించిన వారిని అలరించిన తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ ఉంది.
అంజలి గతంలో గీతాంజలి అనే హర్రర్ చిత్రంలో నటించగా మంచి విజయం సాధించింది. మరో మారు అంజలి అలాంటి ప్రయోగమే చేయబోతోంది. ప్రస్తుతం లిసా అనే ద్విభాషా హర్రర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజగా విడుదల చేశారు. అంజలి భయంకరమైన హర్రర్ లుక్ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని త్రీడి టెక్నాలజీతో రూపొందించనున్నారు. హర్రర్ చిత్రాలకు తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి, రెండు భాషల్లో పట్టు ఉండే అంజలిని ఈ చిత్రానికి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











