అంజలికి షాకిచ్చిన లవర్.. బ్రేకప్ చెప్పిన ప్రియుడు.. సిల్లీ కారణంతో..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో సినీ నటీనటుల హాటుగా ఘాటైన ప్రేమ కథల్లో సినీ తార అంజలి, జై అఫైర్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వారి మధ్య కెమిస్ట్రీ వెండితెరకే పరిమితం కాలేదు. నిజజీవితంలోని మధ్య రిలేషన్ మీడియాలో చర్చనీయాంశమైంది. వారు ఎన్నో సందర్భాల్లో తమ ప్రేమను డైరెక్టుగా వ్యక్తం చేసుకొన్న సంగతి తెలిసిందే.

జై ఎమోషనల్ ట్వీట్
నీవు అత్యంత ఇష్టమైన వ్యక్తివి కాబట్టి నీ బర్త్ డే నాకు చాలా స్పెషల్. నీ జన్మదిన రోజును పురస్కరించుకొని ఓ విషయం చెప్పాలని ఉంది. నా జీవితంలోని ప్రతీ రోజును ఎంతో ప్రత్యేకంగా మలచడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను, దేవుడు ఎప్పుడూ నీవెంటే ఉంటాం. హ్యాపీ బర్త్ డే అంజూ అని జై ట్వీట్ చేశారు.

అంజలికి నో గ్రీటింగ్స్
గతేడాది జూన్ 16న అంజలి బర్త్ డే సందర్భంగా జై తన ప్రేమను ఘాటుగా వ్యక్తం చేస్తూ ఎమోషనల్‌గా ట్విట్టర్‌లో ఓ మెసేజ్‌ను పెట్టారు.
కానీ ఈ ఏడాది అంజలి బర్త్ డే సందర్భంగా ఎలాంటి మెసేజ్ పెట్టకుండా దూరంగా ఉండటంతో అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వారి మధ్య విభేదాలు నెలకొన్నాయనే చర్చ మొదలైంది.

కోలీవుడ్‌లో మీడియా కథనాలు
అయితే తమిళ హీరో జైకి అంజలి గుడ్ బై చెప్పిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల వారు ఒకరికొకరు దూరమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అంజలి బర్త్ డేకు విష్ చేయకుండా దూరంగా ఉన్నారనే మాట తమిళ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నది.

కెరీర్‌పైన అంజలి దృష్టి
జైతో అంజలి ప్రేమ వ్యవహారం ఇక ముగిసింది. తన బర్త్ డేకు విష్ చేయకపోవడంతో వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. ప్రస్తుతం జైకి అంజలి దూరంగా ఉంటున్నది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకొంటున్నది. అందుకు తగినట్టే చాలా సినిమాలు ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి అని తమిళ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











