అంజలితో కల్కి లిప్‌లాక్ వైరల్.. రొమాంటిక్ సీన్లలో నాటుగా, ఘాటుగా..

అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూసిన రెండో తమిళ ఆంథాలజీ పావా కధైగల్ అనే వెబ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. గతంలో అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో తొలి ఆంథాలజీ పుథమ్ పుదు కాలై అనే తమిళ చిత్రం రిలీజై ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. తాజగా బాలీవుడ్ నిర్మాత రోని స్క్రీవాలా తన ఆర్‌ఎస్‌వీపీ, ఆషిదువా, సారాస్ ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్లపై పావా కధైగల్ ఆంథాలజీ రూపొందింది. ఈ అంథాలజీని 190 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.

నలుగురు ప్రముఖ దర్శకులు కలయికలో

నలుగురు ప్రముఖ దర్శకులు కలయికలో

పావా కధైగల్ ఆంథాలజీలోని ఒక్కో ఎపిసోడ్‌కు ప్రముఖ దర్శకులు సుధా కొంగర, గౌతమ్ వాసుదేవన్ మీనన్, విఘ్నేష్ శివన్, వెట్రీ మారన్ దర్శకత్వం వహించారు. అంజలి, ప్రకాశ్ రాజ్, సాయి పల్లవి, కాళీదాస్ జయరామ్, భవానీ సనే, శంతను భాగ్యరాజ్, సిమ్రాన్, కల్కి కోచ్లిన్, నటించారు.

విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో అంజలి రొమాంటిక్‌గా

విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో అంజలి రొమాంటిక్‌గా

విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లవ్ పన్నా ఉత్రనుమ్‌లో అంజలి ద్విపాత్రిభినయం చేసింది. బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్‌తో కలిసి హాట్ సన్నివేశాల్లో జీవించింది. ఇద్దరు మహిళ రొమాంటిక్ రిలేషన్‌షిప్ నేపథ్యంగా సాగే సన్నివేశాల్లో అంజలి, కల్కి కోచ్లీన్ ఘాటుగా నటించారు.

అంజలి, కల్కి కోచ్లిన్ రొమాంటిక్ సీన్లలో

అంజలి, కల్కి కోచ్లిన్ రొమాంటిక్ సీన్లలో

ఇక బెడ్‌రూం సీన్లలో అంజలి, కల్కి కోచ్లిన్ రెచ్చిపోయి నటించారు. ఇద్దరు యువతులు మధ్య సాగే గాఢమైన ఎమోషనల్ సీన్లు, రొమాంటిక్ సీన్లు యువ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. అంజలి తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారనే విషయాన్ని క్రిటిక్స్ పేర్కొంటున్నారు.

సుధా కొంగర దర్శకత్వంలో థాంగమ్

సుధా కొంగర దర్శకత్వంలో థాంగమ్

థాంగమ్ పేరుతో సుధా కొంగర దర్శకత్వం వహించిన చిత్రంలో ట్రాన్స్‌జెండర్‌గా కాళీదాస్ జయరాం, ఇతర పాత్రల్లో శంతను భాగ్యరాజ్, భావానీ స్రే నటించారు. ప్రేమకథగా సాగే ఈ కథలో ఎమోషన్స్‌ను బాగా పండించడంలో నటీనటులు తమ వంతు కృష్టి చేశారు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, సాయి పల్లవి

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, సాయి పల్లవి

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన వాన్‌మగల్ సిమ్రాన్ కీలక పాత్రను పోషించారు. అలాగే వెట్రీమారన్ దర్శకత్వం వహించిన ఓరు ఇరవులో ప్రకాశ్ రాజ్, సాయిపల్లవి తండ్రి, కూతుళ్లుగా నటించారు. సుమతి అనే పాత్రలో సాయి పల్లవి నటించింది. తన ప్రియుడితో లేచిపోయి గర్బవతిగా మారిన యువతిగా తన నటనతో ఆకట్టుకొన్నారు. తండ్రి, కూతుళ్ల మధ్య ఎమోషన్స్ భారీగా పండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X