అంజలి ని తీసుకున్నారట కానీ...

By Srikanya

చెన్నై : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత వరస ఆఫర్స్ వస్తాయని అంజలి ఊహించింది. అయితే ఆమెకు మసాలా లో వెంకీ సరసన,పవర్ లో రవితేజ సరసన వచ్చినా..అవన్ని అంతగా ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ టైపు వేషాలు. సర్లే అని గీతాంజలి చేస్తే అది హిట్టైనా ఆమెకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏ హీరో తన ప్రక్కన చేయమని ఆమెను అడగటం లేదు. దానికి తోడు అంజలి ఒళ్ళు చేయటం కూడా బాగా మైనస్ అయ్యింది. ఇప్పుడు ఓ తమిళ సినిమాలో హిరోయిన్ వేషం సంపాదించింది. దాంతో తన ప్రెండ్స్ అందరికీ ఈ విషయం తెలియచేసిందిట. అయితే అందులో త్రిష మెయిన్ హీరోయిన్...అంజలి సెకండ్ హీరోయిన్ ట.

Anjali to romance Jayam Ravi

తమిళ చిత్రం వివరాల్లోకి వెళితే.... జయంరవి, త్రిష, అంజలి కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'అప్పాటక్కర్‌'. రెండు నెలల క్రితం షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. సమస్యల్లో చిక్కుకున్న అంజలి.. చెన్నై నుంచి వెళ్లిన తర్వాత ఆమె నటిస్తున్న తొలి చిత్రమిది. 'తలైనగరం', 'మరుదమలై', 'పడిక్కాదవన్‌'.. చిత్రాలకు పనిచేసిన సురాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభు, రాధారవి, సూరి, అశ్విన్‌ తదితరులు నటిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితమే ఈ చిత్రానికి 'అప్పాటక్కర్‌' అని నామకరణం చేశారు. తమన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి నటి పూర్ణ చిందులేసింది. ఈ పాటను ప్రస్తుతం మదురైలో తెరకెక్కిస్తున్నారు. మరో రెండు రోజులపాటు చిత్రీకరణ జరగనుంది. హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు దర్శకుడు చెప్పారు. తెన్కాశి, కుట్రాలం ప్రాంతాల్లో త్వరలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తామని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X