రజనీకాంత్ 168 మూవీ అప్‌డేట్: చిరంజీవి సాయం కోరిన సూపర్‌స్టార్
ఇటీవల కాలంలో యువ హీరోలను మంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నారు. దర్బార్ మూవీ రిలీజ్ చేసి రెండు నెలలు కాకముందే మరో సినిమాతో రెడీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న రజనీకాంత్ చిత్రానికి అన్నాతే అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే...

భారీ తారాగణంతో అన్నాతే
అన్నాతే చిత్రం భారీ తారాగణం ఎంపికతో మొదలైంది. సిరుతాయ్ శివ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో నయనతార, కుష్బూ, మీనా, కీర్తీ సురేష్, ప్రకాశ్ రాజ్, సూరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రజనీకాంత్ కూతురుగా కీర్తీ సురేష్ నటించనున్నది.
రజనీకాంత్‌ను కలిసిన మ్యూజిక్ డైరెక్టర్
అన్నాతే సినిమా షూటింగ్‌లో రజనీకాంత్‌ను కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ డీ ఇమామ్ తన ఆనందాన్ని నెటిజన్లతో పంచుకొన్నారు. అత్యంత సాధారణమైన వ్యక్తి, మనకు ఎంతో ఇష్టమైన రజనీకాంత్‌ను కలిశాను. నేను స్వరపరిచిన పాటకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఆయనను కలిసిన తర్వాత ఫీలింగ్ మాటల్లో చెప్పలేను అని ఇమామ్ తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకొన్నారు.

అన్నాతే అంటే..
ఇక అన్నాతే అంటే తమిళంలో అన్నయ్య అని అర్థం. ఫ్యామిలీ విలువలతో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో రజనీకాంత్ కుటుంబ పెద్దగా కనిపించబోతున్నారట. అయితే ఈ చిత్రంలో ద్విపాత్రాభినయమా? లేదా అనే విషయం సీక్రెట్‌గా పెట్టారు. దీంతో ఈ సినిమా కథపై మరింత ఆసక్తి పెరుగుతున్నది.
Recommended Video


చిరంజీవి టైటిల్‌తో
ఇదిలా ఉంటే.. తెలుగులో అన్నయ్య పేరుతో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే గతంలో అన్నయ్య టైటిల్‌తో చిరంజీవి సినిమా రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో తెలుగు టైటిల్ విషయంలో చిరంజీవితో రజనీకాంత్ మాట్లాడరని తాజా సమాచారం. అన్నయ్య టైటిల్ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రజనీకి చిరంజీవి స్పష్టం చేసినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











