Annaatthe, Enemy సినిమాలపై పైరసీ పంజా.. ఆ వెబ్‌సైట్లలో ఫ్రీ డౌన్‌లోడ్..

దీపావళీ పండుగను పురస్కరించుకొని రజనీకాంత్ నటించిన అన్నాతే (తమిళంలో), పెద్దన్న (తెలుగులో) చిత్రం, అలాగే విశాల్, ఆర్య నటించిన ఎనిమీ అలాగే దర్శకుడు మారుతి రూపొందించిన మంచి రోజులు వచ్చాయి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు కూడా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు చిత్రాలపై పైరసీ సైట్లు పంజా విసిరాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ వెబ్‌సైట్లు సినిమాలను తమ వెబ్‌సైట్స్ అప్‌లోడ్ చేసి ఫ్రీ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇవ్వడంతో నిర్మాతలు ఆందోళనలో పడ్డారు.

 Annaatthe, Enemy, manchi rojulu vachayi Full Movie Leaked Online and download

అన్నాతే చిత్రంలో రజనీకాంత్‌తోపాటు నయనతార, కీర్తీ సురేష్, కుష్బూ,మీనా, జగపతి బాబు, అభిమన్యు సింగ్, ప్రకాశ్ రాజ్, బెనర్జీ లాంటి తారలతో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది. అయితే రిలీజ్‌కు ముందు ఉన్న కొద్దిపాటి అంచనాలను కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా పైరసీ బారిన పడటం అభిమానులను మరింత ఆందోళనకు గురిచేసింది.

ఇక విశాల్, ఆర్య కలిసి నటించిన ఎనిమి చిత్రానిది ఇదే పరిస్థితి. హై టెక్నికల్ వ్యాల్యూస్, క్లాస్ టచ్‌, బెస్ట్ మేకింగ్ వ్యాల్యూస్‌తో వచ్చిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. పేలవమైన స్క్రీన్ ప్లే సినిమా పరమబోర్ అనే టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మిశ్రమ స్పందన చూరగొంటున్న నేపథ్యంలో పైరసీకి గురికావడం నిర్మాతలను, డిస్టిబ్యూటర్లను ఆందోళనకు గురిచేసింది.

దీపావళి బరిలో దూకిన మంచి రోజులు వచ్చాయి చిత్రం ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కామెడీ ట్రాక్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. అయితే ఈ సినిమాను కూడా అనేక సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో లీక్ అయింది. ఫ్రీ డౌన్‌లోడ్ ఆప్షన్లతో వెబ్‌సైట్లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేశాయి.

ఇక పెద్దన్న చిత్రం త్వరలోనే సన్ టీవీ, సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. అయితే అంతకు ముందే ఈ సినిమా పైరసీ వెబ్‌సైట్ల రావడం షాక్ గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X