రజినీకాంత్ సినిమాకు చిరంజీవి టైటిల్: అది అయితేనే పర్‌ఫెక్ట్ అంటున్నారట

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం 'అన్నత్తే'. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సిరుత్తి శివ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అన్నయ్య సెంటిమెంట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. బుధవారమే ఈ సినిమా చివరి షెడ్యూల్ కోల్‌కతా నగరంలో ప్రారంభం అయింది. ఇందులో రజినీకాంత్ కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్‌లో తెగ వైరల్ అవుతోంది.

సీనియర్ హీరో రజినీకాంత్ - శివ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమాకు తమిళంలో 'అన్నత్తే' అనే టైటిల్ పెట్టారు. తెలుగులోకి వచ్చే సరికి మాత్రం ఏదైనా పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం కోసం 'అన్నయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని కూడా తెలుస్తోంది. గతంలో ఇదే పేరుతో చిరంజీవి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీన్ని రజినీకాంత్ కోసం వాడుకోబోతున్నారు.

 Annayya Title Fix for Rajinikanths Annaatthe Movie

భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న 'అన్నత్తే' మూవీలో రజినీకాంత్ పవర్‌ఫుల్ రోల్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి దీపావళి నాటికి సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X