twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anniyan remake వివాదంలో అపరిచితుడు రీమేక్.. దర్శకుడు శంకర్‌కు లీగల్ నోటీసులు!

    |

    దక్షిణాదిలో స్టార్ డైరెక్టర్ శంకర్‌ ఇటీవల కాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఇండియన్ 2 సినిమాపై ఓ వైపు కోర్టులో విచారణ జరుగుతుండగా.. తాజాగా మరో సినిమాకు సంబంధించిన వివాదం మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కింది. 2005లో సంచలన విజయం సాధించిన అపరిచితుడు (తమిళంలో అనియన్) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని భావించిన శంకర్‌కు పెద్ద అడ్డంకి ఏర్పడింది. అపరిచితుడు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఈ సినిమా రీమేక్‌కు అభ్యంతరం తెలియజేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వివాదంగా మారింది. శంకర్‌కు సంబంధించిన సినిమా వివాదాల వివరాల్లోకి వెళితే...

     కోర్టులో ఇండియన్ 2 వివాదం

    కోర్టులో ఇండియన్ 2 వివాదం

    విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో రూపొందిస్తున్న ఇండియన్ 2 చిత్ర షూటింగ్ ఆగిపోవడంతో రాంచరణ్, దిల్ రాజు కాంబినేషన్‌లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేయకుండా మరో సినిమాను తీయవద్దంటూ శంకర్‌పై ఇండియన్ 2 నిర్మాతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వివాదాన్ని శంకర్, లైకా ప్రొడక్షన్ సానుకూలంగా పరిష్కరించుకోవాలని రిటైర్డ్ జడ్జీని అంబుడ్సమన్‌గా నియమించారు.

    బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌తో అపరిచితుడు రీమేక్

    బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌తో అపరిచితుడు రీమేక్

    ఆ వివాదం అలా కొనసాగుతుండగానే.. అనియన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి శంకర్ సిద్ధమయ్యారు. బాలీవుడ్‌లో టాప్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కించడానికి ముందుకెళ్తున్న సమయంలో నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

    అనియన్ సినిమా స్టోరీ రైట్స్ తన వద్ద ఉన్నాయి. శంకర్ ఆ సినిమాను తెరకెక్కించడానికి వీలు లేదు. శంకర్ ఆ సినిమా పీ ప్రొడక్షన్ పనులు వెంటనే నిలిపివేయాలి, ఆయనకు నేను లీగల్ నోటీసులు పంపుతున్నాను అని ఆస్కార్ రవిచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు.

    అపరిచితుడు కథా హక్కులు నా వద్దే..

    అపరిచితుడు కథా హక్కులు నా వద్దే..

    అపరిచితుడు (అనియన్) సినిమా హక్కులను కథా రచయిత సుజాత వద్ద నుంచి తాను కొనుగోలు చేశాను. గతంలో ఆయనకు రైట్స్ కింద భారీ మొత్తాన్ని చెల్లించాను. కాబట్టి నా అనుమతి లేకుండా ఆ సినిమాను కాపీ చేయడం లేదా రీమేక్ చేయడం లేదా మూల కథను తీసుకోవడానికి వీలు లేదు. అలా చేస్తే చట్టవ్యతిరేకం అని రవిచంద్రన్ తన లేఖలో తెలిపారు.

    శంకర్ ఘాటుగా రియాక్షన్

    శంకర్ ఘాటుగా రియాక్షన్

    అనియన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ లేఖపై శంకర్ స్పందించారు. అనియన్ కథ హక్కులు మీ వద్ద ఉన్నాయనే విషయంపై నాకు వచ్చిన లేఖను చూసి షాక్ అయ్యాను. ఆ స్క్రిప్టుకు సంబంధించిన హక్కులు నా వద్ద ఉన్నాయి. ఆ కథను వాడుకోవడానికి అన్ని రకాల హక్కుల నాకే ఉన్నాయి. వాస్తవానికి మీకే రీమేక్ రైట్స్ లేవు. అందుకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి అని శంకర్ కార్యాలయం నుంచి ఓ లేఖ విడుదలైంది.

    Recommended Video

    Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
    మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకొంటాం

    మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకొంటాం

    ఇలాంటి భిన్నవాదనల మధ్య అనియన్ చిత్ర కథా హక్కుల విషయం వివాదంగా మారింది. నా అనుమతి లేకుండా సినిమా తీస్తే సహించేది లేదు. శంకర్, జయంతిలాల్ గడ ఇద్దరిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకొంటాను. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి హక్కులను నేను కలిగి ఉన్నాను. ఈ వివాదాన్ని మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకొంటాం. అనియన్ సినిమాను రీమేక్ చేస్తున్నాననే విషయాన్ని తెలుసుకొని షాక్ గురయ్యాను అని ఆస్కార్ రవిచంద్రన్ స్పష్టం చేశారు.

    English summary
    Director Shankar's Anniyan remake in legal trouble. Producer Oscar V Ravichandran legal notices to Director Shankar over story rights issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X