‘లస్ట్ స్టోరీస్’ తరహాలో నలుగురు దర్శకులతో సౌత్‌లో కూడా...
సేక్రేడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్ వంటి హిందీ ప్రాజెక్టులు విజయం సాధించడంతో నెట్‌ఫ్లిక్స్ తన ఫోకస్ కోలీవుడ్ వైపుకు తిప్పినట్లు తెలుస్తోంది. ఈ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం ఒక ఆంథాలజీ(సంకలన) చిత్రం కోసం దక్షిణాది నుండి నలుగురు దర్శకులతో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు తెరపైకి వచ్చాయి.
గౌతమ్ మీనన్, వెట్రిమారన్, సుధ కొంగరా, విఘ్నేష్ శివన్ నలుగురు దర్శకులతో తమిళంలో ఒక ఆంథాలజీ చిత్రం రాబోతోందని, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు ఈ నలుగురితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ మొదటి తమిళ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ అవుతుందని చర్చించుకుంటున్నారు.

కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన హిందీ సంకలన చిత్రం 'లస్ట్ స్టోరీస్' మాదిరిగానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమిళంలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే నలుగురు హిందీ ఫిల్మ్ మేకర్స్‌తో మరొక ఆంథాలజీ ఫిల్మ్ ప్లాన్ చేసింది. దీనికి 'ఘోస్ట్ స్టోరీస్' అని పేరు పెట్టారు.
తమిళ ఫిల్మ్ మేకర్స్ ప్రస్తుతం తమ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. సుధా కొంగర ప్రస్తుతం సూర్య హీరోగా సూరారై పోట్రు సినిమా చేస్తుండగా, వెత్రిమారన్ అసురన్‌తో బిజీగా ఉన్నారు. గౌతమ్ మీనన్ రిలీజ్ కాకుండా మిగిలిన పోయినా తన సినిమాలను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











