twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో సూర్యకు పొంచి ఉన్న ప్రమాదం.. ఇంటి ముందు పోలీసులు.. ఏం జరిగిందంటే?

    |

    తమిళ చిత్ర పరిశ్రమలో బెస్ట్ టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరో సూర్య వివాదాలకు చాలా దూరంగానే ఉంటాడు. వీలైనంత వరకు మంచి కార్యక్రమాలు చేస్తూ నలుగురికి సహాయపడే విధంగా అడుగులు వేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల హీరో సూర్య ఎంచుకుంటున్న కథలు పలు వివాదాలకు దారి తీస్తున్నాయి.

    అతనికి కొన్నిసార్లు హెచ్చరికలు కూడా పంపినట్లు తెలుస్తోంది. ఇక నేడు ఈటి ఎవరికీ తలవంచకు అనే సినిమా విడుదల అవుతున్న సందర్భంగా మరోసారి పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు హీరో సూర్య ఇంటి ముందు బందోబస్తును ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగింది అని వివరాల్లోకి వెళితే..

    జై భీమ్ వివాదం..

    జై భీమ్ వివాదం..

    సూర్య చివరిగా నటించిన 'జై భీమ్' అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఆ సినిమాలో తమ వర్గం వారిని తప్పుగా చూపించారు అంటూ ఓ రాజకీయ పార్టీ ఆరోపణలు వ్యక్తం చేసింది. ఆ సినిమాను అడ్డుకోవాలని సూర్య వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా పలు రాజకీయ గ్రూపులు ఆరోపించాయి. ఇక ఆ వివాదం గురించి హీరో సూర్య పెద్దగా పట్టించుకోలేదు.

    ఈటీ సినిమాపై కూడా..

    ఈటీ సినిమాపై కూడా..

    ఇక జై భీమ్ సినిమాకు వచ్చిన మాదిరిగానే సూర్య తదుపరి చిత్రం ET 'ఎథర్కుమ్ తునిందావన్' అనే సినిమాపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సినిమాను తెలుగులో ఎవరికి తలవంచకు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కూడా అడ్డుకుంటాం అంటూ పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉండడం తమిళ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

     క్షమాపణ చెప్పాలి అంటూ..

    క్షమాపణ చెప్పాలి అంటూ..

    పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్‌ సంఘంకు చెందిన వారు ET సినిమాను వ్యతిరేకిస్తున్నారు. వీరే మరోసారి 'జై భీమ్' అంశాన్ని మరోసారి లేవనెత్తారు. తమ వర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు సూర్య తదుపరి 'ఎథర్కుమ్ తునిందావన్'ని ప్రదర్శించవద్దని మైలదురై, కృష్ణగిరి, కడలూరు ఇలా అనేక ఇతర ప్రాంతాలలోని థియేటర్ యజమానులకు నోటీసులు పంపారు.

    సూర్య ఇంటి ముందు పోలీసులు

    సూర్య ఇంటి ముందు పోలీసులు

    ఇక పరిస్థితులు అదుపు తప్పక ముందే చెన్నై పోలీసులు హీరో సూర్య ఇంటి ముందు తుపాకులతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా సెన్సిటివ్ ఏరియాలలో ఉన్న థియేటర్స్ వద్ద కూడా పోలీసులు ప్రత్యేక బలగాలను ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.

    అభిమానుల విమర్శలు

    అభిమానుల విమర్శలు

    అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీపై అభిమానులు విమర్శలు చేస్తున్నారు. నిర్మాతకు, థియేటర్ యజమానులకు హాని కలిగించేలా సినిమాపై రాజకీయ పార్టీ చేసిన చర్య ఏ మాత్రం కరెక్ట్ కాదని.. అలాగే నెలరోజుల తర్వాత మళ్లీ 'జై భీమ్' అంశాన్ని రాజకీయ పార్టీ తవ్విస్తోందని ట్రోలింగ్ చేస్తున్నారు.

    Recommended Video

    Latest Film Updates : Jai Bhim చిత్రం వివాదం Suriya పై ఆ సంస్థ సంచలన ప్రకటన! || Filmibeat Telugu
    థియేటర్స్ పై దాడులు

    థియేటర్స్ పై దాడులు

    ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించిన 'ఎతర్క్కుం తునిందావన్' నేడు గ్రాండ్ రిలీజ్ అవుతోంది. తెలుగులో ఎవరికి తలవంచకు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇమా ఈ సినిమా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పీఎంకే సభ్యులు కొన్ని ప్రాంతాల్లో 'ఎథర్కుమ్ తునిధావన్' ప్రదర్శిస్తున్న థియేటర్లపై నిరసనలు దాడి చేస్తున్నారు. ఇక సమస్య మరింత పెద్దది కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

    English summary
    Another controversy on tamil hero suriya ET movie..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X