‘శివపుత్రుడు’ కాంబినేషన్లో మరో సంచలనం..!?
తమిళ హీరో విక్రమ్ ని అతని కెరీర్ తొలినాళ్లలో మంచి ఆర్టిస్టుగా నిలబెట్టిన చిత్రం 'శివపుత్రుడు'. అందులో అతనితో బాటు సూర్య కూడా నటించాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బాల కూడా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 'శివపుత్రుడు" చిత్రానికిగాను ఇప్పటికే జాతీయ అవార్డునందుకున్న విక్రమ్, ఇన్నేళ్ళ తర్వాత మరోసారి అవార్డ్ విన్నింగ్ పెర్‌ఫార్మెన్స్ ప్రదర్శించాడానికి బాలా దర్శకత్వంలో విక్రమ్ హీరోగా మరో చిత్రంలో నటించనున్నాడని సమాచారం.
ఈ విషయం గురించి హీరో విక్రం మాట్లాడుతూ, 'బాల దర్శకత్వంలో వచ్చిన శివపుత్రుడు ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. మా ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న తాజా సినిమాలో కూడా నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలను తప్పకుండా అందుకుంటాం" అంటున్నాడు. సో... డెఫినిట్ గా మరో మంచి సినిమాని మనం ఎక్స్ పెక్ట్ చేయచ్చన్న మాట..!


Click it and Unblock the Notifications











